ద్వీపదేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. గ్యాస్, పెట్రోల్ దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితులు మధ్య ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి తమ ఆందోళన, నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏకంగా అధ్యక్షుడు రాజపక్సే నివాసానికి దగ్గర్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సేతో పాటు ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామాలను డిమాండ్ చేస్తున్నారు శ్రీలంక ప్రజలు. తాజాగా ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ప్రధాని…
పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై వ్యతిరేకత తీవ్రమైంది. అధికార కూటమి నుంచి ప్రధాన భాగస్వామ్య పార్టీలు తప్పుకోనున్నాయి. ప్రతిపక్షంలో చేరి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. నాలుగేళ్ల ఖాన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఎక్కువ కావడంతో మిత్రపక్షాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేపు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనున్నారు ఇమ్రాన్ ఖాన్. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేయనని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. తనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ…
తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై స్పందించారు జగ్గారెడ్డి. మహారాష్ట్ర సీఎం తో కలవడం ముఖ్యమైన అంశమే. మహారాష్ట్ర సీఎం..కాంగ్రెస్ తోనే ఉన్నారు కదా..? బీజేపీ తో బాగా సంబంధం ఉంది అనే ప్రచారం నుండి బయట పడాలని కేసీఆర్ ఎత్తుగడ. బీజేపీ ముద్ర నుండి బయట పడే పనిలో కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారు. రైతు ఉద్యమనాయకుడు తికాయత్ కూడా కేసీఆర్ బీజేపీ మనిషి అని చెప్పా. దాని నుండి బయట పడేందుకు కేసీఆర్ పర్యటనల్లో బిజీగా…
తెలంగాణలో హాట్ టాపిక్ మారింది కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం. పార్టీనుంచి త్వరలో బయటకు వస్తానన్నారు జగ్గారెడ్డి. ఆటోలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీల అప్పాయింట్ మెంట్ ఇప్పిస్తే వాళ్ళకే నా ఆవేదన చెప్తా. ఠాగూర్..కేసీ వేణుగోపాల్ దగ్గర పరిష్కారం దొరకదన్నారు. అప్పాయింట్ మెంట్ ఇప్పించకపోతే 15 రోజుల తర్వాత నా నిర్ణయం ప్రకటిస్తానన్నారు. గాంధీ భవన్ లో ఒకరిద్దరు పోతే పోనీ అనే కామెంట్స్…
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు చిచ్చు పెడుతున్నాయి.. తాజాగా, జరిగిన పరిణామాలపై ఆవేదనకు గురైన ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అవసరం అయితే రాజీనామాకైనా సిద్ధమంటున్నారు.. ఇంతకీ ఆమె అసంతృప్తి కారణం ఏంటంటే.. శ్రీశైలం బోర్డు చైర్మన్ నియామకమే. తాజాగా, శ్రీశైలం బోర్డు చైర్మన్‌గా చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని నియమించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయితే, ఈ వ్యవహారం రోజాకు మింగుడుపడడం లేదు.. చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై రోజా కినుకు వహించారు.. కాగా,…
తనపై వస్తున్న విమర్శలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. తాను రాజీనామా చేయనని, చంద్రబాబుని రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. క్యాసినోలపై ఏపీలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు వస్తే క్యాసినోలో ఏం జరిగిందో చూపిస్తానన్నారు.
తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నేడు హైకోర్టు లో సిద్దిపేట మాజీ కలెక్టర్ రాజీనామాపై విచారణ జరగనుంది. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేశారు. రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జె.శంకర్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించనుంది. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఏఎస్ లు కేంద్ర ప్రభుత్వం…
సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలయింది. హైకోర్టులో పిల్ దాఖలు చేశారు రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జె.శంకర్. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు పిటిషనర్లు. ఐఏఎస్ లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని, వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషనర్లు. పిల్ ను లంచ్ మోషన్ గా స్వీకరించాలని…
అవును ఒక్క సవాల్ ఎన్నో కష్టాలు తెచ్చిపెడుతోంది. రాజకీయాల్లోకి వచ్చాక సవాలక్ష సవాళ్ళు, ఆరోపణలు చేస్తుంటాం. అంత మాత్రాన మాట మీద నిలబడమంటే ఎలా. అచ్చం ఇలాంటి బాధలోనే వున్నారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా బాలరాజు చేసిన సవాల్ ఆయన పాలిట శాపంగా మారింది. రాజకీయనేతలు తమ సవాళ్ళు మరిచిపోతారు కానీ ప్రజలు పట్టించుకున్నప్పుడే సమస్య వస్తుంటుంది. ఇప్పుడు అదే సమస్య టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వచ్చింది. ఆయన అన్న…
గుజరాత్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కొన్ని రోజుల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ అధిష్టానం భూపేంద్ర పాటిల్‌ను ముఖ్యమంత్రిగా నియమించింది. కాగా రేపు భూపేంద్ర క్యాబినెట్ ప్రమాణ ప్రమాణస్వీకారం ఉండబోతున్నది. కాగా, ఈరోజు గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటరీకి పంపారు. స్పీకర్ రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చినట్టు సెక్రటరి ప్రకటించారు. కొత్త అసెంబ్లీ స్పీకర్ ఎవరు అన్నది…