తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై స్పందించారు జగ్గారెడ్డి. మహారాష్ట్ర సీఎం తో కలవడం ముఖ్యమైన అంశమే. మహారాష్ట్ర సీఎం..కాంగ్రెస్ తోనే ఉన్నారు కదా..? బీజేపీ తో బాగా సంబంధం ఉంది అనే ప్రచారం నుండి బయట పడాలని కేసీఆర్ ఎత్తుగడ. బీజేపీ ముద్ర నుండి బయట పడే పనిలో కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారు.
రైతు ఉద్యమనాయకుడు తికాయత్ కూడా కేసీఆర్ బీజేపీ మనిషి అని చెప్పా. దాని నుండి బయట పడేందుకు కేసీఆర్ పర్యటనల్లో బిజీగా అవుతున్నారు. యూపీయే కూటమి చీల్చాలి అని కేసీఆర్ అనుకున్నా అది అయ్యే పని కాదు. యూపీయే అనుబంధ పార్టీలతో కేసీఆర్ కలవడంతో బీజేపీ మనిషి అనే ముద్ర పోగొట్టుకోవాలి అని చూస్తున్నారన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోనియా..రాహుల్ ల నిర్ణయం మేరకే పీసీసీలు పని చేయాలి. బీజేపీ తో స్ట్రెయిట్ గా కొట్లడుతున్నది కేవలం స్టాలిన్..మమతా బెనర్జీలే. దమ్మున్న వాడు ఎవడు పార్టీ పెట్టినా స్పేస్ ఉంది తెలంగాణలో. టీఆర్ఎస్‌లో చేరాలి అని అనుకుంటే సింగిల్ ఫోన్ చాలు అన్నారు జగ్గారెడ్డి. నా గేమ్ స్టార్ట్ అయ్యింది. సింగిల్ ఆట నాకు ఇష్టం. నా ఆట చూపిస్తానన్నారు జగ్గారెడ్డి.
భేటీలు ఇంకా ఏం లేవు. నాతో లొల్లి ఎందుకు..అందుకే బయటకు పంపండి అని అంటున్నా. సిల్లీగా మాట్లాడే అనుచరులు ఉంటే ఇలాగే ఉంటుంది. హారికర వేణుగోపాల్ కి ఏం అవసరం. ఇంత రాద్దాంతం జరుగుతుంటే… అలాంటి కామెంట్స్ ఎందుకు? గాంధీ భవన్ లో కూర్చొని ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి? నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. హారికర ఇలా అంటే.. ఎలా అనిపిస్తుంది మా లాంటి వాడికి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.