సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలయింది. హైకోర్టులో పిల్ దాఖలు చేశారు రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జె.శంకర్. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు పిటిషనర్లు. ఐఏఎస్ లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని, వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు.
ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషనర్లు. పిల్ ను లంచ్ మోషన్ గా స్వీకరించాలని కోరారు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి. అత్యవసర విచారణ చేపట్టేందుకు నిరాకరించింది హైకోర్టు. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.