పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ గోషామహల్ ఇంఛార్జి నందకిషోర్ వ్యాస్ రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి, తెలంగాణ భవన్ కి ప్యాక్స్ లో పంపించారు. తాను ఇక నుంచి పార్టీలో పని చేయలేనని.. పార్టీలోని తన పోస్టుకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగి హస్తం పార్టీలో చేరారు. తాజాగా.. బీఆర్‌ఎస్‌కు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి రాజీనామా చేశారు. కృష్ణారెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి రాజీనామా చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్ధీన్, డిప్యూటీ మేయర్…
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మనువడు విభాకర్ శాస్త్రి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవాన్ ఈరోజు బీజేపీలో చేరారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మహారాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నిన్న కాంగ్రెస్ కు రాజీనామాతో పాటు అసెంబ్లీ సభ్యత్వానికి చవాన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం తన వ్యక్తిగత విషయమన్నారు. మరో రెండు రోజుల్లో తదుపరి నిర్ణయాలు తీసుకుంటానని…
ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున రావు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో సమావేశమై.. ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలో రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
సోమవారం సాయంత్రం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయగా.. తాజాగా టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుడు ఆర్. సత్యనారాయణ రాజీనామా చేశారు. కాగా.. చైర్మన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదన్న విషయం తెలిసిందే. అయితే.. పేపర్ లీకేజీ, తదితర వ్యవహారాలపై పూర్తి బాధ్యులను గుర్తించే వరకూ రాజీనామాలను ఆమోదించకపోవచ్చని ఊహాగానాలూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తన రాజీనామాకు సంబంధించి సత్యనారాయణ ఓ లేఖ రాశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం.. 15 రోజుల లోపు ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల సంఘం ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో.. బీఆర్ఎస్…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇవాళ మధ్యహ్నం ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణకు వచ్చాక తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.
Jalagam Venkatarao: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారు.
మరో నెల రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార జోరును పెంచుతూ ఉంటే.. కొందరు కీలక నేతలు తమకు పార్టీలో స్థానం దక్కడం లేదని రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ దక్కలేదన్న తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.