Vibhakar Shastri resign: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మనువడు విభాకర్ శాస్త్రి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు పంపిన లేఖలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కకపోవడంతో విభాకర్ శాస్త్రి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. ఇక, ఆయన ఇవాళే ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీలో జాయిన్ అయ్యారు.
Read Also: Telangana Assembly: అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ వాకౌట్..
అయితే, మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో విభాకర్ శాస్త్రి రాజీనామా చేశారు. విభాకర్ శాస్త్రి 1998లో ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసినప్పటికీ కేవలం 24,688 ఓట్లు మాత్రమే సాధించాడు. కాగా, 1999లో మరోసారి పోటీ చేయగా.. 95 వేల ఓట్లు, 2009లో లక్ష ఓట్లు సాధించగలిగాడు తప్ప విజయం మాత్రం సాధించలేకపోయాడు.
Read Also: Taiwan vs China Conflict: 14 చైనీస్ యుద్ధ విమానాలు మా దేశం చుట్టు తిరుగుతున్నాయి..
ఇక, కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. మరికొద్ది నెలల్లో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీని వీడే నేతల సంఖ్య జోరుగా కొనసాగుతుంది. సోమవారం నాడు మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.. తాజాగా, మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మనువడు విభాకర్ శాస్త్రి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Hon'ble Congress President Shri @kharge ji!
Respected Sir,
I hereby tender my resignation from the primary membership of Indian National Congress (@INCIndia)
Regards
Vibhakar Shastri— Vibhakar Shastri (@VShastri_) February 14, 2024