T.Congress: మరో నెల రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార జోరును పెంచుతూ ఉంటే.. కొందరు కీలక నేతలు తమకు పార్టీలో స్థానం దక్కడం లేదని రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ దక్కలేదన్న తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఆయనకు టికెట్ లభించకపోవడంతో అధిష్టానం కొన్ని హామీలు ఇచ్చింది.. అయినప్పటికీ పార్టీలో కొనసాగేందుకు మొగ్గు చూపలేదు. దీంతో హస్తం పార్టీకి నాగం రాజీనామా చేశారు.
CM KCR: బీఆర్‌ఎస్సే రాష్ట్రానికి శ్రీరామరక్ష.. సంక్షేమం అమలు, రాష్ట్రం అభివృద్ధే లక్ష్యం
ఇటీవలే పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ టికెట్ ఖరారు చేయడంతో పార్టీ తీరుపై నాగం కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈయన కాంగ్రెస్ పార్టీని వీడారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా చెప్పలేదని విచారం వ్యక్తం చేశారు. 2018 నుంచి నాగర్‌కర్నూల్‌లో పార్టీ బలోపేతం కోసం అన్ని కార్యక్రమాలు చేపట్టానని, కానీ బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దామోదర్‌రెడ్డి కుమారుడికి పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. బోగస్ సర్వేల పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు మోసం చేశారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే సాయంత్రం నాగం జనార్ధన్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.