Kejriwal: రేపే కేజ్రీవాల్ రాజీనామా.. ఎల్జీ అపాయింట్‌మెంట్!
- మంగళవారం సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
- అపాయింట్‌మెంట్ ఇచ్చిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనా
- మహారాష్ట్ర ఎన్నికలతో పాటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే.సక్సేనా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు వీకే.సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఇటీవలే కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇంటికి చేరుకున్న ఆయన ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రెండ్రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పొలిటికల్‌గా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఇది కూడా చదవండి: Prashanth Reddy: ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి.. తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. అనంతరం ఆయన పలుమార్లు బెయిల్‌కు అప్లై చేసినా తిరస్కరణకు గురయ్యాయి. ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఈ వేడిలోనే ప్రభుత్వం రద్దైతే.. తనను కేంద్రం ఇబ్బంది పెట్టి.. జైల్లో పెట్టిన విషయం ప్రజలకు గుర్తుంటుందని కేజ్రీవాల్, ఆప్ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి. వీటితో పాటే ఢిల్లీ ఎన్నికలు జరిగితే ప్రజల నుంచి సానుభూతి పొందవచ్చని ఆప్ నేతలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Janasena: షాకింగ్: జానీ మాస్టర్ కు జనసేన కీలక ఆదేశాలు!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?