Ratan Naval Tata: రతన్‌టాటాకు మాజీ పీఎంకి మధ్య ఘర్షణ.. రాజీనామా స్థాయికి చేరిన అంశం!
- రతన్‌టాటాకు మాజీ పీఎం వీపీ సింగ్‌తో గొడవ
- రాజీనామా స్థాయికి చేరిన అంశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గత రాత్రి కన్నుమూశారు. కానీ ఆయన భారతీయుల మదిలో ఎప్పటికీ బతికే ఉంటారు. టాటా సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లి ఉన్నత శిఖరాలకు చేర్చిన ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. రతన్ టాటా కన్నుమూశాక చాలా కథనాలు బయటకు వస్తున్నాయి. ఈ సందర్భంగా రతన్ టాటా మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన ఓ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Sabita Indra Reddy: ముఖ్యమంత్రిపై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు..
Also Read
- Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
- EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
- PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ..
- Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
రతన్ టాటా గతంలో మనీ లైఫ్ అనే ప్రైవేట్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ప్రధాని వీపీ సింగ్‌కు సంబంధించిన ఘటనను ఆయన వివరంగా ప్రస్తావించారు. “నేను ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కి ఛైర్మన్ గా ఉన్న రోజులవి. మూడేళ్లుగా అదే పదవిలో కొనసాగాను. కానీ ఆ సమయంలో పనులు సరిగ్గా జరగలేదు. ఇది సమస్యలతో నిండిన ఏడాది. దీనికి కారణం ఎయిరిండియా రాజకీయ ఒత్తిళ్లకు గురైంది. ఆలోచనలు కూడా భిన్నంగా ఉండేవి.” అని చెప్పారు.
READ MORE:Ratan Tata: రతన్ టాటా “పెళ్లి” ప్రయత్నాలు నాలుగు సార్లు విఫలం..
ఆ సమయంలో విపి సింగ్‌కి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో జేఆర్డీ టాటా ఆయనకు లేఖ రాశారు. టాటా జగ్పై విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన ఆరోపణలపై లేఖలో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు మాజీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ భురే లాల్ విచారణకు నాయకత్వం వహించారని ఇంటర్వ్యూలో రతన్ టాటా చెప్పారు. సంస్థ స్థాపించిన వాళ్ల సంతనంతో పాటు మనవడు కూడా రిజిస్ట్రేషన్ కోసం రిజర్వ్ బ్యాంక్ అనుమతి అవసరమా లేదా అనేది సమస్య. ఈ విషయాన్ని ఎప్పటికీ రుజువు చేయలేరని ఆయన అన్నారు. విచారణలో మాపై వచ్చిన ఆరోపణలను రుజువు చేసే ఏదీ దొరకలేదని తెలిపారు.
READ MORE:Ratan Tata: రతన్ టాటా “పెళ్లి” ప్రయత్నాలు నాలుగు సార్లు విఫలం..
వీపీ సింగ్‌పై ఆయన అంటే రతన్ టాటా అసంతృప్తికి లోనవడంతో విషయం రాజీనామా దాకా చేరింది . ఈ వ్యవహారం రతన్ టాటా తన పదవికి రాజీనామా చేసే స్థాయికి చేరుకుంది. అయితే రాజీవ్ గాంధీ కారణంగా ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. రాజీవ్ గాంధీ ఆయనను ఒప్పించడంతో రతన్ టాటా రాజీనామాకు నిరాకరించారు. టాటా కంటే భారతీయ హోటళ్ల చుట్టూ ఈ సమస్య ఎక్కువగా తిరుగుతుందని రతన్ టాటా తన ఇంటర్వ్యూలో చెప్పారు. భారతీయ హోటళ్లలో విదేశీ కార్యకలాపాలు చాలా ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో నాకు అప్పటి ప్రధాని వీపీ సింగ్‌తో శత్రుత్వం ఏర్పడిందని రతన్ టాటా స్వయంగా చెప్పారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!