కష్టాలు చుట్టుముట్టిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో.. అరవింద్ కేజ్రీవాల్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ బుధవారం తన పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
Real Manjummel Boys: రీల్ కాదు రియల్ మంజుమ్మల్ బాయ్స్ ను చూశారా?
ఈ క్రమంలో.. ఆప్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడిందని.. పార్టీలో దళితులకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని రాజ్‌కుమార్ ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిందని, కానీ నేడు ఆ పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు. మంత్రిగా ఈ ప్రభుత్వంలో పనిచేయడం తనకు అసౌకర్యంగా మారిందని పేర్కొన్నారు.
Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకును ఢీకొన్న కారు, ఐదుగురు మృతి
అవినీతితో తన పేరు రాకూడదని, ఈ పార్టీకి, ప్రభుత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని రాజ్‌కుమార్ ఆనంద్ అన్నారు. రాజ్‌కుమార్ ఆనంద్ సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. తాజాగా.. రాజ్‌కుమార్ ఆనంద్ ఇంటిపై కూడా ఈడీ దాడులు చేసింది. గతేడాది నవంబర్‌లో కూడా రాజ్‌కుమార్ ఆనంద్ ఇంటికి వెళ్లి ఈడీ బృందం దాడులు చేపట్టింది. ఇదిలా ఉంటే.. మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. రాజ్‌కుమార్ రాజీనామాతో పార్టీలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.