నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న సాక్ష్యాధారాలు లేని కారణంగా ఓ ఖైదీకి విధించిన జీవిత ఖైదును అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలో అతన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
భూ వివాదానికి సంబంధించిన క్రిమినల్ బెదిరింపు కేసులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లికి రిలీఫ్ దక్కింది. ఈ కేసులో మనోరమ ఖేద్కర్‌కు శుక్రవారం పూణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అడిషనల్ సెషన్స్ జడ్జి ఏఎన్ మారే బెయిల్ మంజూరు చేసినట్లు మనోరమ తరఫు న్యాయవాది సుధీర్ షా తెలిపారు. 2023లో పూణేలోని ముల్షి తహసీల్‌లోని ధద్వాలీ గ్రామంలో భూ వివాదంపై మనోరమ కొంతమందిని తుపాకీతో బెదిరించిన వీడియో వైరల్ కావడంతో పూణే…
గత కొద్ది రోజులుగా వేడి గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హస్తిన వాసులకు శుక్రవారం ఉపశమనం లభించింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే హర్యానాలోని గురుగ్రామ్‌లో కూడా భారీ వర్షం కురుస్తోంది.
ఈ రోజుల్లో జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల అనేక వ్యాధులు తలెత్తుతున్నాయి. వీటిలో థైరాయిడ్ ఒకటి. అవును, థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉన్న ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. జీవక్రియ, పెరుగుదల, హృదయ స్పందన రేటును నియంత్రించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
సైఫర్ కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ను ఇస్లామాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
తేలికపాటి వర్షం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఎండల నుండి ఉపశమనం పొందారు. వరుసగా ఆరు రోజులుగా తీవ్రమైన వేడిగాలుల తర్వాత.. శనివారం దేశ రాజధానిలో వాతావరణం కొద్దిగా మారిపోయింది. ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం కాసేపు సూర్యరశ్మి ఉన్నప్పటికీ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మళ్లీ ఆకాశం మేఘావృతమై ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసింది. దీంతో.. ఆరు రోజుల తర్వాత శనివారం వేడిగాలుల నుండి కొంత ఉపశమనం లభించింది.
ఏపీ హైకోర్టులో రాజధాని రైతులకు ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. ప్లాట్లను రద్దు చేస్తూ 862 మంది రైతులకు సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతనిపై ఉన్న పరువు నష్టం కేసుపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం మధ్యంతర స్టే విధించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసును గుజరాత్ నుంచి బదిలీ చేయాలని తేజస్వి యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తేజస్వి యాదవ్ బదిలీ పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ రోజుల్లో చాలా మంది మెకాళ్లు, మోచేతి, వెన్నెముక, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. చాలా మందిలో యూరిక్ యాసిడ్ పెరగడం మూలంగా కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వ్యాయామాలు చేయడంతో ఆ నొప్పులు ఇంకా వీపరీతమవుతున్నాయి.
Rahul Gandhi: జార్ఖండ్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారణ జరిపింది. రాహుల్‌పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఆగస్టు 16న విచారణ చేపట్టనున్నది. 2019లో కర్ణాటక కోలార్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రధానిని ఉద్దేశించి ‘మోడీ’ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో…