Pooja Khedkar Mother: పూజా ఖేద్కర్ తల్లికి రిలీఫ్..! బెయిల్ మంజూరు
- భూ వివాదానికి సంబంధించిన క్రిమినల్ బెదిరింపు కేసులో..
- మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లికి రిలీఫ్
- మనోరమ ఖేద్కర్‌కు శుక్రవారం పూణె కోర్టు బెయిల్ మంజూరు
- 2023లో పూణేలోని ముల్షి తహసీల్‌లోని ధద్వాలీ గ్రామంలో భూ వివాదంపై..
- కొంతమందిని తుపాకీతో బెదిరించిన వీడియో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూ వివాదానికి సంబంధించిన క్రిమినల్ బెదిరింపు కేసులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లికి రిలీఫ్ దక్కింది. ఈ కేసులో మనోరమ ఖేద్కర్‌కు శుక్రవారం పూణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అడిషనల్ సెషన్స్ జడ్జి ఏఎన్ మారే బెయిల్ మంజూరు చేసినట్లు మనోరమ తరఫు న్యాయవాది సుధీర్ షా తెలిపారు. 2023లో పూణేలోని ముల్షి తహసీల్‌లోని ధద్వాలీ గ్రామంలో భూ వివాదంపై మనోరమ కొంతమందిని తుపాకీతో బెదిరించిన వీడియో వైరల్ కావడంతో పూణే రూరల్ పోలీసులు మనోరమ.. ఆమె భర్త దిలీప్ ఖేద్కర్ కోసం వెతకడం గమనార్హం.
Read Also: CM Chandrababu: సివిల్ సప్లైస్, ఎక్సైజ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
Also Read
దీంతో పోలీసులు ఖేద్కర్ దంపతులతో పాటు మరో ఐదుగురిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 307, 144, 147, 506 సెక్షన్లతో పాటు ఆయుధాల చట్టంలోని సెక్షన్లు కూడా ఆమెపై విధించారు. ఈ కేసులో చాలా కాలంగా పరారీలో ఉన్న మనోరమను రాయ్‌గఢ్ జిల్లా మహద్ సమీపంలోని హిర్కానివాడి గ్రామంలోని లాడ్జిలో పట్టుకున్నారు. మరోవైపు ఈ కేసులో దిలీప్ ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ మంజూరైంది.
Read Also: Whatsapp: వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్.. మీ డీపీ ఇక సేఫ్..
ఇదిలా ఉంటే.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కేసులో పూజా ఖేద్కర్‌కు బుధవారం పెద్ద దెబ్బ తగిలింది. ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తాత్కాలిక అభ్యర్థిత్వాన్ని రద్దు చేశామని, భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షలు, ఎంపికల నుంచి ఆమెను డిబార్ చేశామని UPSC తెలిపింది. దాంతో పాటు.. ఢిల్లీ కోర్టులో ఆమె వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ క్రమంలో.. ఏదో సమయంలో ఢిల్లీ పోలీసులు పూజా ఖేద్కర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు