బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతనిపై ఉన్న పరువు నష్టం కేసుపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం మధ్యంతర స్టే విధించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసును గుజరాత్ నుంచి బదిలీ చేయాలని తేజస్వి యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తేజస్వి యాదవ్ బదిలీ పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చిలో తేజస్వి యాదవ్ గుజరాతీలను దుండగులు అని వ్యాఖ్యానించారు. దీంతో అతనిపై కేసు నమోదైంది.
AP CM Jagan: జగనన్న ఆరోగ్య సురక్ష, ‘వై ఏపీ నీడ్స్ జగన్’ క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం సమీక్ష
ఇదిలా ఉంటే.. అంతకుముందు తనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసును బదిలీ చేయాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు అహ్మదాబాద్ కోర్టుకు తేజస్వి యాదవ్ తెలిపారు. తన న్యాయవాది ద్వారా అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ DJ పర్మార్ కోర్టులో హాజరు నుండి మినహాయింపు కోసం అభ్యర్థించారు. ఈ కేసుపై తేజస్వి యాదవ్ పై క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు కాగా.. సెప్టెంబర్‌లో అహ్మదాబాద్ కోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్ 22న జరిగిన విచారణలో కోర్టు ఆయనకు సమన్లు కూడా జారీ చేసింది.
AP CM Jagan: జగనన్న ఆరోగ్య సురక్ష, ‘వై ఏపీ నీడ్స్ జగన్’ క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం సమీక్ష
శనివారం ఈ కేసుపై కోర్టులో విచారణ జరిగింది.. అయితే తేజస్వి గైర్హాజరు కావడంతో వాయిదా పడింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేశారు. అయితే తేజస్వి గైర్హాజరీలో కూడా కేసు విచారణ జరపాలని ఫిర్యాదుదారు తెలిపారు. మరోవైపు బీహార్ డిప్యూటీ సిఎం అధికారిక కార్యక్రమంలో బిజీగా ఉండటం వల్ల హాజరు కాలేకపోయారని తేజస్వి తరపున కోర్టుకు హాజరైన లాయర్ పిటిషన్ ద్వారా తెలిపారు. కేసును బదిలీ చేయాలని కోరుతూ సిఆర్‌పిసి సెక్షన్ 406 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ముఖ్యమైన, అధికారిక కార్యక్రమాల కారణంగా తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని తేజస్వి పిటిషన్‌లో పేర్కొన్నారు.