ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో.. మరోసారి సత్తా చాటింది.. ఆ మధ్య కొత్త కస్టమర్లను యాడ్ చేసుకోవడం అటుంచితే.. ఉన్నవారినే కోల్పోయిన సందర్భాలున్నాయి.. అయినా.. నెంబర్ వన్‌గా కొనసాగుతూ వచ్చింది ఆ సంస్థ.. తాజాగా.. మళ్లీ కొత్త కస్టమర్లను యాడ్ చేసుకుంటూ దూకుడు చూపిస్తోంది.. జూన్ నెలకుగాను టెలికం సంస్థల యూజర్ల డేటాను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.. జియో మరోసారి అదరగొట్టింది. టెలికం రంగంలోని మిగతా…
టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. మరోసారి జియో ఫోన్ 5జీతో వినియోగదారులకు చేరువయ్యేందుకు సిద్ధమైంది.
Jio 5G Smart Phone: దేశంలో త్వరలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో అన్ని మొబైల్ కంపెనీలు 5జీ స్మార్ట్ ఫోన్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తయారుచేస్తోంది. ఈ ఏడాది చివర్లోగా ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వీలైతే దసరా నాటికి రిలయన్స్ జియో నుంచి 5జీ స్మార్ట్ ఫోన్ రానుంది. దీంతో జియో ఫోన్‌లో ఎలాంటి…
5G spectrum auction: వారం పాటు సాగిన 5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తంగా రూ.1,50,173 కోట్ల బిడ్లు దాఖలైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 10 కోట్ల కనెక్షన్‌లున్న యూపీ స్పెక్ట్రం దక్కించుకోవడానికి టెలికాం సంస్థలు పోటీ పడ్డాయి. ఈ బిడ్డింగ్‌లో రిలయన్స్ జియో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. జియో రూ.80వేల 100కోట్లు, ఎయిర్‌టెల్ రూ.50వేల కోట్లు, ఐడియా వొడాఫోన్ రూ.15వేల కోట్లు, అదానీ గ్రూప్ రూ.500 కోట్లు-రూ.1000 కోట్ల బిడ్లు దాఖలు చేశాయి.…
5జీ స్పెక్ట్రమ్ వేలంలో గురువారం మూడో రోజు ముగిసే సమయానికి ప్రభుత్వానికి 1,49,623 కోట్ల రూపాయల విలువైన బిడ్‌లు వచ్చాయి. కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేలం మూడో రోజు ముగిసే వరకు 16 రౌండ్ల బిడ్డింగ్‌లు పూర్తయ్యాయి. శుక్రవారం నాలుగో రోజు వేలం కొనసాగనుంది.
మరికొన్ని రోజుల్లో 5 జీ స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం కాబోతోంది. ఇదే సమయంలో రిలయన్స్ జియో దుమ్మురేపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దూకుడు ప్రదర్శించింది. భారతదేశ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ శుక్రవారం తన ఎప్రిల్-జూన్ తొలి త్రైమాసిక లాభాలను ప్రకటించింది. తొలి త్రైమాసికానికి రూ. 21,873 కోట్ల ఆదాయాలను నమోదు చేసింది. నికర లాభం 24% పెరిగింది.
Business Headlines: ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిఫ్టీ50 గత నెలలో ఆసియాలో టాప్ లెవల్‌కి చేరుకుంది. ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసీజీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్‌లు, రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకర్షించాయి.
trai releases may month telecom companies subscribers data: ట్రాయ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం మే నెలలో రిలయన్స్ జియో రికార్డు స్థాయిలో కొత్త కస్టమర్లను చేర్చుకుంది. మే నెలలో జియో నెట్‌వర్క్‌ను కొత్తగా 31 లక్షల మంది ఎంచుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరిందని ట్రాయ్ తెలిపింది. ఇదే నెలలో ఎయిర్‌టెల్‌లో 10.27 లక్షల మంది చేరడంతో యూజర్ల సంఖ్య 36.21 కోట్లకు చేరింది. వొడాఫోన్…
ముకేశ్ అంబానీ.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. అపర కుబేరుల్లో ముకేశ్ ఒకడు. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థగా వెలుగొందుతున్న రిలయన్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. ఇక ముకేశ్ జీవిత చరిత్ర కూడా అందరికి తెరిచిన పుస్తకమే.. తండ్రి ధీరుభాయి అంబానీ కష్టపడి కట్టిన వ్యాపార సామ్రాజ్యాన్ని సోదరుడు అనిల్ అంబానీతో కలిసి అంతకు పదింతలు చేశాడు. తండ్రి ఉన్నంతవరకు కలిసికట్టుగా ఉన్న ఈ అన్నదమ్ములు తండ్రి మరణం తరువాత వ్యాపార లావాదేవీలతో విడిపోయారు. ఒకరిపై…
ప్రస్తుతం దేశంలోని పలు టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఎయిర్‌టెల్, జియో మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వార్ నడుస్తోంది. జియో దెబ్బతో ఎయిర్‌టెల్ కూడా రీ ఛార్జ్ ప్లాన్లను తక్కువ ధరకే అందిస్తుందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే నెట్వర్క్ పరంగా ఏది బెస్ట్ అయితే కస్టమర్లు దానినే ఎంచుకుంటున్నారు. ఎయిర్‌టెల్ నుంచి పోటీ ఉండటంతో జియో కూడా ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఒకప్పుడు మొబైల్ యూజర్లు 20…