Reliance Jio: తన వినియోగదారులకు రిలయన్స్ జియో షాకిచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందించే అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందించే రూ. 499, 601, 799, 1099, 333, 419, 583, 783, 1199 ప్లాన్‌లను రిలయన్స్ జియో తొలగించింది. అయితే ఈ నిర్ణయానికి ఓ కారణముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ డిస్నీ హాట్ స్టార్‌లో…
భారత్‌లో 5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, ఒక్కొక్కటిగా తమ 5జీ సర్వీలను ప్రారంభిస్తున్నాయి టెలికం సంస్థలు.. భారత్ టెలికం మార్కెట్‌లో తక్కువ సమయంలోనూ కోట్లాది మంది అభిమాన్ని చురగొని అతిపెద్ద టెలికం సంస్థగా అవిర్భవించిన రిలయన్స్ జియో.. ఇప్పుడు.. 5జీలోనూ దూకుడు చూపిస్తోంది.. విజయదశమిని పురస్కరించుకుని 5జీ సర్వీస్‌లను మొదలుపెట్టింది జియో.. అయితే, ప్రస్తుతానికి దేశంలోని నాలుగు సిటీల్లో ట్రయల్స్ కోసం 5జీ బీటా నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. అంతేకాదు.. వెల్‌కమ్ ఆఫర్‌ను…
భారత్‌లో త్వరలోనే 5జీ సేవలు ప్రారంభం కాబోతున్నాయి.. అక్టోబర్ 1వ తేదీన 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ఇప్పటికే నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ ప్రకటించింది. 5జీ స్పెక్ట్రమ్‌కు సంబంధించిన వేలం ఇటీవలే ముగియగా.. ఈ వేలంలో ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఆదానీ డేటా నెట్‌వర్క్స్ పోటీపడి టెలీకాం సెక్టార్లను సొంతం చేసుకున్నాయి.. అక్టోబర్ 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ 5జీ సేవలను ప్రారంభించనున్నారు.. ఇక, 5జీ స్మార్ట్‌ఫోన్లు కూడా భారత్ మార్కెట్‌లోకి…
Huge Orders to Hyderabad Company: హైదరాబాద్‌లోని MTAR Technologies కంపెనీకి 540 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఈ సంస్థ సివిలియన్ న్యూక్లియర్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, స్పేస్, బాల్ స్క్రూలు మరియు రోలర్ స్క్రూలు, మెరైన్ తదితర సెగ్మెంట్లతోపాటు పర్యావరణ అనుకూల ఇంధన విభాగంలో సేవలందిస్తోంది. క్లీన్ ఎనర్జీకి సంబంధించి పెద్ద సంఖ్యలో కొత్త ఆర్డర్లు లభించటంతో రానున్న రోజుల్లో ఈ సెక్టార్‌లో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది.
Special Story on Jio Super Success Journey: ప్రస్తుతం మన దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థ రిలయెన్స్ జియో అనే సంగతి అందరికీ తెలిసిందే. జియో పూర్తి పేరు 'జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఆపర్చునిటీ'. ఈ కంపెనీ 2016లో ప్రారంభమైంది. లాంఛ్ అయిన రెండేళ్లలోనే అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్‌గా ఎదిగింది. రిలయెన్స్ జియోని ప్రారంభించాలనే ముఖేష్ అంబానీ ఆలోచనకు మూలకారణం ఆయన కూతురు ఇషా అంబానీ. కాలేజీ అసైన్‌మెంట్ సబ్మిట్ చేసే సమయంలో డేటా స్లోగా ఉండటం…
టెలికం మార్కెట్‌లో రిలయన్స్ జియో ఓ సంచలనం.. అన్ని ఫ్రీ అంటూ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న ఆ సంస్థ.. ఆ తర్వాత టారిప్ రేట్లు పెంచుతూ పోయినా.. కస్టమర్ల నుంచి ఆదరణ పొందుతూనే వచ్చింది.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కస్టమర్లను కోల్పోయినా.. క్రమంగా మాత్రం వారి సంఖ్య పెంచుకుంటూనే ఉంది.. మరోవైపు.. ఇప్పుడు డేటా వినియోగం పెరిగిపోయింది.. వన్ జీబీ, 1.5 జీబీ డేటా సరిపోవడం లేదు.. దీంతో, ఆ వారి కష్టాలకు చెక్ పెట్టేందుకు పలు…
ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో.. మరోసారి సత్తా చాటింది.. ఆ మధ్య కొత్త కస్టమర్లను యాడ్ చేసుకోవడం అటుంచితే.. ఉన్నవారినే కోల్పోయిన సందర్భాలున్నాయి.. అయినా.. నెంబర్ వన్‌గా కొనసాగుతూ వచ్చింది ఆ సంస్థ.. తాజాగా.. మళ్లీ కొత్త కస్టమర్లను యాడ్ చేసుకుంటూ దూకుడు చూపిస్తోంది.. జూన్ నెలకుగాను టెలికం సంస్థల యూజర్ల డేటాను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.. జియో మరోసారి అదరగొట్టింది. టెలికం రంగంలోని మిగతా…
టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. మరోసారి జియో ఫోన్ 5జీతో వినియోగదారులకు చేరువయ్యేందుకు సిద్ధమైంది.
Jio 5G Smart Phone: దేశంలో త్వరలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో అన్ని మొబైల్ కంపెనీలు 5జీ స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తయారుచేస్తోంది. ఈ ఏడాది చివర్లోగా ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వీలైతే దసరా నాటికి రిలయన్స్ జియో నుంచి 5జీ స్మార్ట్ ఫోన్ రానుంది. దీంతో జియో ఫోన్లో ఎలాంటి…