Business Headlines: నిఫ్టీ50 బెస్ట్ పెర్ఫార్మెన్స్
ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిఫ్టీ50 బెస్ట్ పెర్ఫార్మర్‌గా నిలవటం విశేషం. గత నెలలో ఆసియా దేశాల్లోని అన్ని స్టాక్ మార్కెట్ల కన్నా నిఫ్టీ టాప్ లెవల్‌కి చేరుకుంది. ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసీజీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్‌లు, రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకర్షించాయి. వివిధ రంగాలు, సంస్థలు మూడు నెలలుగా ప్రదర్శిస్తున్న పనితీరును బట్టి చూస్తే స్టాక్ మార్కెట్లలో రానున్న రోజుల్లో ట్రేడింగ్ మరింత సానుకూలంగా సాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
విండ్‌ఫాల్ ట్యాక్స్‌ల తగ్గింపు
అంతర్జాతీయంగా ఇంధనం ధరలు దిగొస్తుండటంతో వాటి ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌లను విధించిన మూడు వారాల్లోపే కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. గ్యాసోలిసిన్ ఎక్స్‌పోర్ట్‌ల పైన లీటర్‌కి 6 రూపాయల చొప్పున లెవీని పూర్తిగా తొలగించింది. డీజిల్‌తోపాటు విమాన ఇంధనంపై లీటర్‌కి 2 రూపాయల చొప్పున విండ్‌ఫాల్ ట్యాక్స్‌ని తగ్గించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
జియో, ఎయిర్‌టెల్‌కి పెరిగిన యూజర్లు
మే నెలలో రిలయెన్స్ జియోకి 31 లక్షల మంది కొత్త కస్టమర్లు పెరిగారు. ఎయిర్‌టెల్‌కి 10 లక్షల మంది యూజర్లు యాడయ్యారు. వొడాఫోన్-ఐడియాకి మాత్రం వినియోగదారులు తగ్గారు. ఈ నేపథ్యంలో టెలికం మార్కెట్‌లో జియో అత్యధిక వాటాను అంటే 35 పాయింట్ ఆరు తొమ్మిది శాతం షేరును సొంతం చేసుకుంది. 31 పాయింట్ ఆరు రెండు శాతం వాటాతో ఎయిర్‌టెల్ రెండో స్థానంలో ఉంది. వొడాఫోన్-ఐడియా షేరు మరింత తగ్గి 22 పాయింట్ ఐదు ఆరు శాతానికి పడిపోయింది.
read more: AndhraPradesh Woman: మానవ సేవే “మాధవి” సేవ. అంతిమ ‘సంస్కారం’ చూపుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళ
‘రూపాయి’తో లాభమూ నష్టం
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రూపాయి సహా మెజారిటీ కరెన్సీల కన్నా డాలర్‌దే పైచేయి అయింది. దీంతో నిన్న మంగళవారం రూపాయి మారకం విలువ 80 మార్కును దాటిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం మన దేశ ఎగుమతులకు కొంచెం ఊతం ఇస్తుందేమో గానీ వాణిజ్య లోటును మాత్రం మరింత పెంచనుంది. క్రూడాయిల్, బంగారం దిగుమతులను తగ్గించినప్పటికీ రూపాయి మారకం విలువ పతనంతో వాణిజ్య లోటుకు కలిగే ఉపశమనం స్వల్పమేనని అంటున్నారు.
300 బిలియన్ డాలర్లకు బయోఎకానమీ!
ఇండియా బయో ఎకానమీ 2025 నాటికి 150 బిలియన్ డాలర్లకు, 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేరొచ్చంటున్నారు. తాజాగా విడుదలైన ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ భవిష్యత్ అంచనాలను వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో బయోటెక్ సంస్థల వాటాల సమాచారాన్ని బట్టి ఈ నివేదికను రూపొందించారు. గతేడాది ఇండియా ఎకానమీలో బయోటెక్ కంపెనీల షేరు 80 బిలియన్ డాలర్లకు పైగా నమోదైంది. 2020తో పోల్చితే ఇది 14 పాయింట్ 1 శాతం ఎక్కువే కావటం చెప్పుకోదగ్గ విషయం.