ముకేశ్ అంబానీ.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. అపర కుబేరుల్లో ముకేశ్ ఒకడు. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థగా వెలుగొందుతున్న రిలయన్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. ఇక ముకేశ్ జీవిత చరిత్ర కూడా అందరికి తెరిచిన పుస్తకమే.. తండ్రి ధీరుభాయి అంబానీ కష్టపడి కట్టిన వ్యాపార సామ్రాజ్యాన్ని సోదరుడు అనిల్ అంబానీతో కలిసి అంతకు పదింతలు చేశాడు. తండ్రి ఉన్నంతవరకు కలిసికట్టుగా ఉన్న ఈ అన్నదమ్ములు తండ్రి మరణం తరువాత వ్యాపార లావాదేవీలతో విడిపోయారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ తమ వ్యాపారాలను సైతం పంచుకొని ఎవరి వ్యాపారాన్ని వారు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక తమలా తమ పిల్లలు వ్యాపారాల కోసం కొట్టుకోకూడదని, అన్నదమ్ముల మధ్య వైరం రాకూడదని భావించిన ముకేశ్ ముందునుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తాను బ్రతికి ఉన్నప్పుడే కొడుకులకు వ్యాపారాలను అప్పగించి ప్రశాంతంగా శేష జీవితం గడపాలని కోరుకుంటున్నాడట. ఈ నేపథ్యంలోనే కొడుకులకు ఆస్తుల పంపకం మొదలుపెట్టేశాడని సమాచారం. రెండు రోజుల క్రితమే రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి, ఆ ప్లేస్ లో కొడుకు ఆకాష్ అంబానీని కుర్చోపెట్టాడు. ఇక మరో రిటైల్ కు సంబంధించిన వ్యవహారాలను కూతురుకు అందించినట్లు సమాచారం.. మరో ముఖ్యమైన విభాగానికి చిన్న కొడుకు అనంత్ అంబానీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ముకేశ్ తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి తప్పు లేదని, డబ్బు విషయంలో ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పలేము కాబట్టి ఎవరి బాధ్యతలు వారికి అప్పగించడం మంచిదే అంటూ పలువురు ముకేశ్ ను ప్రశంసిస్తున్నారు.