Jio 5G Smart Phone: దేశంలో త్వరలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో అన్ని మొబైల్ కంపెనీలు 5జీ స్మార్ట్ ఫోన్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తయారుచేస్తోంది. ఈ ఏడాది చివర్లోగా ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వీలైతే దసరా నాటికి రిలయన్స్ జియో నుంచి 5జీ స్మార్ట్ ఫోన్ రానుంది. దీంతో జియో ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో. .ధర ఎంత ఉంటుందన్న దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జియో 5జీ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ ఇస్ ప్లే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. గూగూల్, జియో కలిపి అభివృద్ధి చేసిన ప్రగతి ఓఎస్‌తోనే ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.
Read Also: ఇండియాలో అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న సినిమా థియేటర్లు ఇవే..!!
అటు స్నాప్‌డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్‌తో జియో స్మార్ట్ ఫోన్ పనిచేస్తుందని సమాచారం అందుతోంది . ఇందులో స్నాప్ డ్రాగన్ ఎక్స్ 51 మోడెమ్ ఉండనుంది. జియో 5జీ ఫోన్ 5 రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తాయని టెక్నాలజీ నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో ఫోన్‌లో మొత్తం 3 కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. మెరుగైన భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండనుంది. వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ కెమెరా, ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. జియో 5జీ ఫోన్ 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ వేరియంట్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా గతేడాది జియో ఫోన్ నెక్ట్స్‌ను వినియోగదారులకు ముందుకు తెచ్చింది. కేవలం రూ.5 వేలకే స్మార్ట్‌ఫోన్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. తాజాగా దానికి కొనసాగింపుగా 5జీ ఫోన్‌ను తీసుకురానున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది.