trai releases may month telecom companies subscribers data: ట్రాయ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం మే నెలలో రిలయన్స్ జియో రికార్డు స్థాయిలో కొత్త కస్టమర్లను చేర్చుకుంది. మే నెలలో జియో నెట్‌వర్క్‌ను కొత్తగా 31 లక్షల మంది ఎంచుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరిందని ట్రాయ్ తెలిపింది. ఇదే నెలలో ఎయిర్‌టెల్‌లో 10.27 లక్షల మంది చేరడంతో యూజర్ల సంఖ్య 36.21 కోట్లకు చేరింది. వొడాఫోన్ ఐడియా(వీఐ)ను 7.59 లక్షల మంది వీడటంతో యూజర్ల సంఖ్య 25.84 కోట్లకు చేరింది. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య కూడా దాదాపు 53.62 లక్షలు తగ్గింది. దీంతో బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య11.28 కోట్లకు పడిపోయింది.
Read Also: Model Pooja Sarkar: బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడాక మోడల్ ఆత్మహత్య
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారీగా వినియోగదారుల సంఖ్యను గమనిస్తే రిలయన్స్ జియో మరోసారి నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ ఏడాది మే నెలలో ఏపీ, తెలంగాణలో 3.27 లక్షల మంది కొత్త సబ్ స్క్రైబర్లను రిలయన్స్ జియో చేర్చుకుంది. అటు భారతీ ఎయిర్‌టెల్ 71,312 మంది మొబైల్ కస్టమర్లను చేర్చుకుంది. మరోవైపు ఇదే సమయంలో వోడాఫోన్ ఐడియా 74,808 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోగా, ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ 78,423 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది.