ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనుంది. ప్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబర్ 31 లోపు సమర్పించాల్సి ఉంది. తుది గడువుకు మరికొన్ని గంటలే ఉన్న నేపథ్యంలో అభిమానుల దృష్టి అంతా రిటెన్షన్ జాబితాపైనే ఉంది. ఏ ప్రాంచైజీ ఏయే ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటుంది, ఎవరిని వేలంలోకి వదిలేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తుది గడువు సమీపిస్తున్నా కొద్దీ.. స్టార్ ఆటగాళ్ల చుట్టూ పలు ఆసక్తికర కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి…
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనుంది. వేలంకు సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ఈసారి ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి మరో మూడు రోజుల మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఊహించినట్లుగానే లక్నో తమ కెప్టెన్ కేఎల్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్‌ను గెలవలేదు. 2016లో ఫైనల్ చేరినా తృటిలో టైటిల్ మిస్ అయింది. ఐపీఎల్ 2024లో ఎలిమినేటర్ మ్యాచ్ ఓడి ఇంటిదారి పట్టింది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని ఆర్‌సీబీ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కీలక ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 31వ తేదీలోపు ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది.…
ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ నిబంధనలపై ఇటీవల బీసీసీఐ స్పష్టతను ఇచ్చింది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాను అన్ని ప్రాంఛైజీలు సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ మూడో వారంలో వేలం జరిగే అవకాశం ఉంది. వేలం నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్‌గా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మను తీసుకుని సారథిగా నియమిస్తారని నెట్టింట చర్చ మొదలైంది. అయితే ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటెన్షన్ చేసుకుని.. సారథ్య బాధ్యతలను…
AB De Villiers About Rohit Sharma Joins in RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవల బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అవకాశం ఇచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. గతంలో ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూ రూ.90 కోట్లు కాగా.. సారి రూ.120 కోట్లకు పెంచారు.…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త రిటెన్షన్ నిబంధనను రూపొందించింది. అక్టోబర్ 31 లోపు అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని కోరింది. ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ అనేక కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ క్రమంలో.. ఈసారి మెగా వేలం చాలా ఆసక్తికరంగా ఉండనుంది. తదుపరి సీజన్ కోసం మెగా వేలానికి ముందు.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఆర్సీబీకి సలహా ఇచ్చాడు. ఆర్సీబీ విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకుని..…
RCB IPL 2025 Retained Players List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025కి సంబంధించి మెగా వేలం వచ్చే నవంబర్‌లో ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో అన్ని ప్రాంఛైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌పై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పటికే రిటెన్షన్ లిస్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆర్సీబీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అధికారికంగా ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు కానీ..…
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆర్సీబీలోకి చేరతారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. కర్ణాటకకు చెందిన ఆటగాడిని కావడంతో ఆర్సీబీ తరఫున ఆడాలనే కోరిక ఉంది అని తన అభిప్రాయాన్ని కేఎల్ రాహుల్ వ్యక్తం చేసినట్లు సమాచారం.
Aakash Chopra About RCB Retention for IPL 2025: ఈ ఏడాది డిసెంబర్లో ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా వేలం జరగనుంది. రిటెన్షన్‌కు సంబంధించి ఇటీవల బీసీసీఐ, ప్రాంచైజీల మధ్య భేటీ జరగగా.. భారత క్రికెట్ బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే రిటెన్షన్‌కు సంబంధించి బీసీసీఐ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ ద్వారా ఎంతమంది క్రికెటర్లకు అవకాశం ఇస్తారనే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఐపీఎల్…
Dinesh Karthik About Rohit Sharma RCB Captaincy: ఐపీఎల్ 2025 వేలం నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. వచ్చే ఏడాది ఐపీఎల్లో రోహిత్ ఏ జట్టుకు ఆడతాడనే విషయంపై నిత్యం చర్చ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల నుంచి కెప్టెన్సీ ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులోకి కూడా రోహిత్ వెళుతున్నాడని జోరుగా ప్రచారం…