ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్‌ను గెలవలేదు. 2016లో ఫైనల్ చేరినా తృటిలో టైటిల్ మిస్ అయింది. ఐపీఎల్ 2024లో ఎలిమినేటర్ మ్యాచ్ ఓడి ఇంటిదారి పట్టింది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని ఆర్‌సీబీ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కీలక ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.
అక్టోబర్ 31వ తేదీలోపు ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ రిటెన్షన్ లిస్ట్‌కు సంబందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదట స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆర్‌సీబీ రిటైన్ చేసుకుందట. తర్వాత లిస్ట్‌లో మహమ్మద్ సిరాజ్, విల్ జాక్స్‌ల ఉన్నారు. ఆర్‌టీఎమ్ ద్వారా రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్‌లను తీసుకోనుందట. అన్‌క్యాప్‌డ్ ఆటగాడిగా యష్ దయాల్‌ను రిటైన్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: India Head Coach: గంభీర్ స్థానంలో టీమిండియాకు కొత్త కోచ్!
గత ఐపీఎల్ సీజన్‌లో పెద్దగా రాణించని గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ పక్కన పెట్టిందట. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను అట్టిపెట్టుకోవడం లేదట. గత ఎడిషన్‌లో పెద్దగా రాణించకపోవడం, వయసు 40 ఏళ్లకు చేరడమే ఫాఫ్ వేటుకు కారణం. అతడి స్థానంలో యువ ఆటగాడిని తీసుకోవాలనుకుంటుందట. వేలంలో కెప్టెన్సీ సత్తా ఉన్న ఆటగాడిని ఆర్‌సీబీ తీసుకోనుందని తెలుస్తోంది. దుబాయ్‌లో నవంబర్ మూడో వారంలో మెగా వేలం జరిగే అవకాశం ఉంది.