ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ నిబంధనలపై ఇటీవల బీసీసీఐ స్పష్టతను ఇచ్చింది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాను అన్ని ప్రాంఛైజీలు సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ మూడో వారంలో వేలం జరిగే అవకాశం ఉంది. వేలం నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్‌గా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మను తీసుకుని సారథిగా నియమిస్తారని నెట్టింట చర్చ మొదలైంది. అయితే ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటెన్షన్ చేసుకుని.. సారథ్య బాధ్యతలను అప్పగిస్తే బాగుంటుందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ… ‘ఫాప్ డుప్లెసిస్‌కు వయసు ఎక్కువైపోయిందని అందరూ అంటున్నారు. ఫాప్ 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం చాలా మంది ఓ సమస్యగా చూస్తున్నారు. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే. ఫిట్‌నెస్ విషయంలో ఫాప్ అద్భుతం. మరికొన్ని సీజన్ల పాటు అతడు ఆడతాడు. కెప్టెన్‌గా ఆర్‌సీబీకి ఫాప్ ఒక్కసారి కూడా కప్‌ను అందించలేదు. అదొక్కటే అతడికి ప్రతికూలం. విరాట్ కోహ్లీ కూడా అతడికి అండగా నిలుస్తాడని భావిస్తున్నా. ఆర్‌సీబీలో ఫాఫ్ కొనసాగడం కోహ్లీకి ఇష్టమే’ అని పేర్కొన్నాడు.
Also Read: Suresh Raina Sixes: సిక్సర్లతో విరుచుకుపడ్డ సురేశ్ రైనా.. ఏం బ్యాటింగ్ సామీ అది! (వీడియో)
బెంగళూరు రిటైన్ జాబితాపై క్రికెట్ విశ్లేషకులు తమ అంచనాలను వెల్లడించారు. ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్‌సీబీ రిటైన్ చేసుకోకపోవచ్చని చాలా మంది అభిప్రాయపడ్డారు. గ్లెన్ మాక్స్‌వెల్‌ను కూడా పక్కన పెట్టేయనుందని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్, యశ్ దయాళ్ రిటెన్షన్ లిస్టులో ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.