ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు కొనసాగుతుంది. వేలంగా ప్రారంభం కాగానే.. బిడ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ పేరు వచ్చింది. గత సీజన్‌లో ఆర్సీబీ జట్టును గెలిపించడంలో సాయశక్తుల పోరాడినప్పటికీ.. చివరకు సెమీస్ వరకు చేర్చాడు. ఒంటి చేత్తో కొన్ని మ్యాచ్‌లను కూడా గెలిపించాడు డుప్లెసిస్. అయితే.. ఈసారి కూడా ఆర్టీఎం (RTM) ఉపయోగించి బెంగళూరు ఈ ఆటగాడిని జట్టులోకి తీసుకుంటుందనుకుంటే.. వద్దని చేతులెత్తేశారు. దీంతో డుప్లెసిస్ ను ఢిల్లీ క్యాపిటల్స్ బేస్ ధర…
IPL 2025 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం తొలి రోజు మొత్తంగా 84 మంది ఆటగాళ్లు వేలానికి వచ్చారు. అందులో కేవలం 72 మంది మాత్రమే అమ్ముడుపోయారు. మిగతా 12 మంది అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. 10 టీమ్స్ 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏకంగా 467.95 కోట్ల రూపాయలు వెచ్చించాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంకు సమయం ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం ప్రక్రియ జరగనుంది. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు 574 మందినే బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. వేలంలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి పది ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. మరి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇక వేలంలో టీమిండియా స్టార్స్ కేఎల్ రాహుల్,…
నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జడ్డాలో జరగనుంది. వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)ని టాప్ రిటెన్షన్‌గా తీసుకోగా.. బ్యాటర్ రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు), పేసర్ యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)ను అట్టిపెట్టుకుంది. ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్ లాంటి స్టార్ ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. రూ.83…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సిద్దమైంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ.. కొత్త జట్టు కోసం ప్రణాళికలు రూపొందించింది. వేలంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. భారీ ధర పెట్టైనా రాహుల్‌ను సొంతం చేసుకుని.. జట్టు పగ్గాలు అప్పగించాలనే ప్రణాళికతో ఆర్‌సీబీ ఉందట. అయితే వేలంకు ముందే సపోర్ట్ స్టాఫ్ విషయంలోనూ ఆర్సీబీ…
ఐపీఎల్ 2025 మెగా వేలం మరికొన్ని రోజుల్లో జరగనుంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. మెగా వేలంకు ముందు తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫ్రాంచైజీ విడిచి పెట్టిన విషయం తెలిసిందే. అట్టిపెట్టుకోవాలని ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకా చూసినా.. అందుకు రాహుల్ ఒప్పుకోలేదట. ఏదేమైనా మెగా వేలంలో రాహుల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అభిమానుల కోసం తాజాగా బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)…
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు), రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు), యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)ను ఆర్సీబీ అట్టిపెట్టుకుంది. చాలామంది స్టార్ ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. 2021 నుంచి జట్టులో ఉన్న ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్సీబీ తనను అట్టిపెట్టుకోవడంపై తాజాగా మ్యాక్సీ స్పందించాడు.…
ఐపీఎల్ 2025 మెగా వేలం డేట్స్ వచ్చేశాయి. ఈ నెల 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. నవంబర్ 4తో ఆటగాళ్ల నమోదు ప్రక్రియ అధికారికంగా ముగిసింది. మొత్తం 1,574 మంది ప్లేయర్స్ వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. అంతకుముందు అక్టోబర్ 31న రిటెన్షన్ జాబితాకు గడువు ముగియగా.. 10 ప్రాంఛైజీలు తమ లిస్ట్ ప్రకటించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషబ్ పంత్‌ను వేలంలోకి వదిలేసింది. మేనేజ్మెంట్తో తలెత్తిన విభేదాల…
IPL 2025 Retention Players: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేయడానికి గడువు నేటితో (సెప్టెంబర్ 31) ముగుస్తుంది. సాయంత్రం నాటికి మొత్తం 10 జట్ల రిటెన్షన్ జాబితా క్లియర్ కానున్నాయి. మరి ఏ జట్టు ఏ ఆటగాడిని రిటైన్ చేసుకోబోతోందన్న విషయానికి వస్తే.. అందిన సమాచారం మేరకు ప్రతి జట్టు ఏఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటుందంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్…