RBI Repo Rate 2024: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. వరుసగా ఏడోసారి కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఏప్రిల్ 3న ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు వెల్లడించారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆర్‌బీఐ ఎంపీసీ ప్రకటన. Also Read: Apple…
RBI Rate Cut: సామాన్యులకు ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. EMIలు చౌకగా లభిస్తాయని ఆశించే వారి ఆశలను రిజర్వ్ బ్యాంక్ అడియాశలు చేసింది. ప్రస్తుతం ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం లేదు.
ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు వదులుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిపై బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. బ్యాంకుల్లో అట్రిషన్ రేటును ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు వదులుకునే వారి సంఖ్య భారీగా పెరిగిందని ఆయన అన్నారు.
ద్రవ్యోల్భణం కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కఠిన మానిటరీ పాలసీ నిర్ణయాల మూలంగా వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే, ఇవి ఎంత కాలం ఉంటాయనే దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక కామెంట్స్ చేశారు.
Shaktikanta Das: మొరాకోలోని మారాకేష్ నగరంలో శనివారం జరిగిన గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ కార్డ్స్ 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్‌కి 'A+' ర్యాంక్ లభించింది.
RBI MPC Meeting: ఈ వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన సమావేశం జరుగనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు ఈసారి కూడా మార్చదని తెలుస్తోంది. వారం చివరిలో వడ్డీ పెంపుపై నిర్ణయం తీసుకోబడుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఈ బ్యాంకుల నుంచి రుణాలను పొందిన కోట్లాది మంది కస్టమర్లకు ఇది బిగ్ రిలీఫ్ న్యూస్ గా చెప్పవచ్చు. 43వ ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని కీలక ప్రకటన చేసింది.