రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) MPC సమావేశ ఫలితాలు వెల్లడయ్యాయి. సెప్టెంబర్ 29న ప్రారంభమైన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ, RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఈసారి రెపో రేటుపై కీలక ప్రకటన చేశారు. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదని తెలిపారు. రెపో రేటు 5.5 శాతం యథాతథం ఉంచినట్లు వెల్లడించారు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ తెలిపింది. రుణ EMIపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ఆగస్టు తర్వాత, అక్టోబర్‌లో వడ్డీ…
RBI Governor: డిజిటల్ పేమెంట్స్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇది నిజం.. ఎందుకంటే చిన్న కిరాణ కొట్టు నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఎక్కడికి వెళ్లిన చెల్లింపులు చేసే పద్ధతి మాత్రం ఒక్కటే అదే… యూపీఐ పేమెంట్స్. గుర్తుంచుకో మిత్రమా ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఇక నుంచి మరోలెక్క. ఇకపై యూపీఐ పేమెంట్స్ ఉచితం కాదని, పే చెల్లించాల్సిందే అని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా…
UPI Payments: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులు వేగంగా సాగుతున్న వేళ, ఉచిత UPI సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన తాజా వ్యాఖ్యలు వినియోగదారుల్లో కలవరం రేపుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా అందుతున్న UPI సేవలు భవిష్యత్తులో ఉచితంగా ఉండకపోవచ్చని ఆయన సూచించారు. ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ఈ విషయమై మాట్లాడుతూ.. ఉచిత డిజిటల్ లావాదేవీల యుగం ముగింపు దశకు చేరుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం…
బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 100, రూ. 200 నోట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.100, రూ.200 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కొత్తగా విడుదల చేయనున్న నోట్ల డిజైన్‌లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. ఆర్బీఐ గతంలో జారీ చేసిన రూ.100, రూ.200 నోట్లన్నీ చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయని తెలిపింది. Also Read:Narendra Modi : భోజ్ పురిలో మాట్లాడిన…
రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించి మధ్యతరగతికి పెద్ద ఉపశమనం కలిగించింది. శుక్రవారం ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం తర్వాత కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అందించారు. కేంద్ర బ్యాంకు రెపో రేటును 0.25% (25 బేసిస్ పాయింట్లు) తగ్గించిందని ఆయన అన్నారు. ఈ కోత తర్వాత, రెపో రేటు 6.50% నుంచి 6.25%కి తగ్గింది.
Shaktikanta Das: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ రోజు ( డిసెంబర్ 10) తన పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం పెద్ద షాక్ ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో దేశ వృద్ధి రేటుకు సంబంధించి ఆయన తన అంచనాను వెల్లడించారు. ఈ అంచనా ప్రకారం.. FY 25కి దేశ జీడీపీ వృద్ధి తక్కువగానే ఉండవచ్చు. ఈ సమావేశంలో 25 ఆర్థిక సంవత్సరానికి దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను గవర్నర్ 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించారు.
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేగవంతమైన ద్రవ్యోల్బణం కొత్త రిస్క్‌ను దేశం తీసుకోకూడదని ఆయన అన్నారు. రెపో రేటు పాలసీ రేటును 6.5 శాతంగా కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. “ధరల స్థిరత్వాన్ని కొనసాగించడం ద్వారా మాత్రమే ద్రవ్య విధానం ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది” అని దాస్ సమావేశంలో అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాలసీ రేటును…
ఫైనాన్షియల్ మార్కెట్పై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల మాదిరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.