RBI Governor: దేశంలో రూ. 2000 నోటు రద్దుతో ఆర్థిక వ్యవస్థపై ఎలాంటిప్రభావం పడలేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. పెద్ద నోట్ల రద్దు మూలంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని కొందరు ఆర్థికరంగ నిపుణులు, రాజకీయ పార్టీల నేతలు విమర్శల నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ వివరణ ఇచ్చారు. రూ. 2000 నోటు రద్దు తరువాత నెల రోజుల్లోనే పెద్ద సంఖ్యలో డిపాజిట్ల రూపంలో తిరిగి వచ్చాయని తెలిపారు.
Read also: Boyapati Rapo: ‘రామ్-బోయపాటి’ పవర్ ఫుల్ టైటిల్…
రూ. 2,000 నోటు వెనక్కి తీసుకోవడం వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. తాను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నానని .. రూ. 2 వేల రూపాయలనోట్ల విత్‌డ్రా వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని.. దీని వల్ల ఎంత సానుకూల ప్రభావం ఉంటుందనేది, భవిష్యత్‌లో మాత్రమే తెలుస్తుందఅని శక్తికాంత దాస్ తెలిపారు. రూ.2,000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నోట్లు క్రమంగా సర్క్యూలేషన్‌లో తగ్గిపోయాయని ఆర్‌బీఐ తెలిపింది. 2018 మార్చి 31 నాటికి మార్కెట్‌లో రూ.6.73 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు మార్కెట్లో ఉన్నాయని ప్రకటించింది. మొత్తం నోట్లలో వాటి వాటా 37.3 శాతమని పేర్కొంది. కాగా, 2023 మార్చి 31 నాటికి మార్కెట్లో ఉన్న మొత్తం రూ. 2,000 నోట్ల కరెన్సీ విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గిందని తెలిపింది ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రస్తుతం మొత్తం నోట్లలో వీటి శాతం కేవలం 10.8 శాతమేనని తెలిపింది.
Read also: Heavy Rains: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్
రీకాల్ ఆర్డర్ వచ్చిన నెల రోజుల్లోనే రూ. 2,000 కరెన్సీ నోట్లలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ తిరిగి సిస్టమ్‌లోకి వచ్చినట్లు ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు.జూన్ 8న ఆర్థిక సంవత్సరం రెండో ద్రవ్య విధాన సమీక్షను ప్రకటిస్తూ, దాస్ మాట్లాడుతూ రూ. 1.8 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు తిరిగి వచ్చాయని, మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న నోట్లలో దాదాపు 50 శాతం ఉన్నాయని, ఇందులో 85 శాతం డిపాజిట్లలో మరియు మిగిలినవి మార్పిడిలో ఉన్నాయన్నారు. ఇప్పుడు రీకాల్ చేసిన రూ. 2000 నోట్లలో మూడింట రెండు వంతులు రూ. 2.41 లక్షల కోట్ల విలువైన రూ. 3.62 లక్షల కోట్లు (మార్చి 31, 2023 నాటికి) గత వారం మధ్య నాటికి సిస్టమ్‌లోకి వచ్చాయని గవర్నర్ దాస్ చెప్పారు.తిరిగి వచ్చిన మొత్తం డబ్బులో 85 శాతం డిపాజిట్లలో.. మిగిలినవి కరెన్సీ మార్పిడిలో ఉన్నాయని ఆయన వివరించారు.