Anil Ravipudi Speech At Ramarao On Duty Trailer Launch: ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ లాంచ్ వేడుకకి అతిథిగా వచ్చేసిన దర్శకులు అనిల్ రావిపూడి.. ఈ సందర్బంగా ఓ ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ చేశాడు. మాస్ మహారాజా రవితేజతో ‘రాజా ది గ్రేట్’ సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశాడు. ఇదివరకే పలుసార్లు ఈ సీక్వెల్ ప్రస్తావన తీసుకొచ్చాడు కానీ, ఈసారి మాత్రం కచ్ఛితంగా తాను రవితేజతో ‘రాజా ది గ్రేట్ 2’ తీస్తానని బల్లగుద్ది చెప్పేశాడు. కాకపోతే, ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇద్దరు ఎలాగో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కాబట్టి, ఆ సీక్వెల్‌కి కొంత ఎక్కువ సమయమే పట్టేలా ఉంది.
ఇక రామారావు ఆన్ డ్యూటీ గురించి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని, చూస్తుంటే దర్శకుడు శరత్ మండావా సినిమాని చాలా బాగా తీసినట్టు అనిపిస్తోందని అనిల్ అభిప్రాయపడ్డాడు. సామ్ సీఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్, అలాగే విజువల్స్ చాలా బాగా వచ్చాయన్నాడు. టీజర్, సాంగ్స్‌తో పాటు తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఎక్స్ టార్డినరీగా ఉన్నాయన్నాడు. రవితేజ కేవలం మాస్ మహారాజా మాత్రమే కాదని, మంచి మనసున్న మారాజు అని కొనియాడాడు. ఎందుకంటే.. ఆయన ఎందరో దర్శకులకు అవకాశం ఇచ్చారని, కష్టాల్లో ఉన్న వారికి సైతం బ్లాక్‌బస్టర్లిచ్చి కెరీర్లు మార్చేశారని చెప్పాడు.
‘రామారావు’ అనే టైటిల్ రవితేజ ఇమేజ్‌కి సెట్ అయ్యే మాస్ టైటిల్ అని, ఈ సినిమా 29వ తేదీ వస్తోన్న ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని తాను ఆశిస్తున్నానని అన్నాడు. నిర్మాతలకు, నటీనటులకు, టెక్నీషియన్స్‌కి ఆల్ ద బెస్ట్ చెప్తూ.. అనిల్ తన ప్రసంగాన్ని ముగించాడు.
https://www.youtube.com/watch?v=btzenKGuoMU