Ravi Teja does not depend on luck and lotteries!
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ కాబోతోంది. శరత్ మండవ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీకి సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. గత కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా మూవీ ప్రమోషన్స్ ను డిఫరెంట్ వేలో చేస్తున్న చిత్రబృందం తాజాగా ‘రామారావు మాస్ నోటీస్’ అంటూ యాక్షన్ సీక్వెన్స్ టీజర్ ను విడుదల చేసింది. దీంతో మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్’ బ్రిలియంట్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించింది. ”నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండయ్యేవాడిని కాదు.. నా వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని” అని రవితేజ చెప్పిన డైలాగ్స్ థియేటర్ లో ఫ్యాన్స్ తో విజల్స్ వేయించే మూమెంట్ లా వుంది. ”మీ ఆయన మెరుపు లాంటి వాడు. శబ్దం లేకుండా వెలుగునిచ్చే రకం” అని తనికెళ్ళ భరణి చెప్పే డైలాగ్ రామారావు పాత్ర ఎంత పవర్ ఫుల్ గా వుంటుందో తెలియజేసింది. యాక్షన్ ఎపిసోడ్స్ పవర్ ఫుల్ గా ఉండటమే కాదు… సినిమాలో సమ్ థింగ్ స్పెషల్ ఏదో ఉందనే ఆసక్తిని ఈ యాక్షన్ టీజర్ కలిగించింది. సామ్ సిఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్ గా వుంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
Mass Mode ON!
Here’s #RamaraoMassNotice 🔥
– https://t.co/QlqcTLzuXjRamaRao will See you at theatres from JULY 29 :)))#RamaRaoOnDuty@directorsarat @Divyanshaaaaaa @rajisha_vijayan @SamCSmusic @sathyaDP @RTTeamWorks @SLVCinemasOffl pic.twitter.com/1PsXcEinZi
— Ravi Teja (@RaviTeja_offl) July 27, 2022