Rana Daggubati Confirmed In Maanadu Remake: తమిళంలో మంచి విజయం సాధించిన ‘మానాడు’ని తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో కసరత్తులు జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాకి హిట్ స్టేటస్ రాగానే నిర్మాత సురేశ్ బాబు రీమేక్ హక్కులు తీసుకోగా.. తొలుత ఇందులో మాస్ మమారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించనున్నట్టు వార్తలొచ్చాయి. అనంతరం మరో ఇద్దరు, ముగ్గురు హీరోల పేర్లు చక్కర్లు కొట్టాయి. చివరికి నాగ చైతన్య కన్ఫమ్ అయినట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు.. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని, త్వరలోనే దీనిపై అధికార ప్రకటన కూడా రానుందని టాక్స్ వినిపించాయి.
అయితే.. లేటెస్ట్‌గా తాను ‘మానాడు’ రీమేక్‌లో నటించడం లేదని నాగ చైతన్య బాంబ్ పేల్చాడు. రానా దగ్గుబాటితో ఈ రీమేక్ చేస్తున్నారని స్పష్టం చేశారు. థాంక్యూ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సీక్రెట్‌ని రివీల్ చేశాడు చైతూ. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జరుగుతుండగా, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. నిజానికి.. గతంలోనే ఈ ప్రాజెక్ట్ రానాతో ఉండొచ్చని ఇండస్ట్రీలో చెప్పుకున్నారు. సురేశ్ బాబు రైట్స్ తీసుకున్నారు కాబట్టి, సరైన హిట్ కోసం పరితపిస్తున్న రానాతోనే ఈ రీమేక్ చేయొచ్చని పుకార్లు వినిపించాయి. ఇన్ని రోజుల తర్వాత ఆ పుకార్లు నిజమేనని నాగ చైతన్య స్పష్టం చేసేశాడు. మక్కీకి మక్కీ దింపకుండా, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సబ్జెక్ట్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేయనున్నట్టు తెలిసింది.
కాగా.. రీసెంట్‌గా విరాటపర్వంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రానా, తన బాబాయ్ వెంకటేశ్‌తో కలిసి ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చిత్రీకరణను సైతం పూర్తి చేశాడు. దీంతో పాటు మరిన్ని వెబ్ ప్రాజెక్ట్స్ కోసం అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి దిగ్గజ ఓటీటీ సంస్థలతో చేతులు కలుపుతున్నాడు. ఇవే కాదు.. రానా చేతిలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులూ ఉన్నాయి.