Ravi Teja Gives Clarity On Remuneration Rumours: మాస్ మహారాజా రవితేజ రెమ్యునరేషన్ విషయంలో మొండిగా వ్యవహరిస్తాడని ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాను అడిగినంత డబ్బులు ఇస్తేనే సినిమాలకు సంతకం చేస్తాడని, లేకపోతే చేయడంటూ ప్రచారం జరుగుతోంది. రెమ్యునరేషన్ వల్లే ఎన్నో మంచి సినిమాల్ని కూడా వదులుకున్నాడని వార్తలొచ్చాయి. అయితే, వీటిని రవితేజ కొన్ని సందర్భాల్లో తోసిపుచ్చాడు.
నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసి, చెక్‌లని చించేసిన సందర్భాలూ ఉన్నాయంటూ.. ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమానికి వచ్చినప్పుడు రవితేజ క్లారిటీ ఇచ్చాడు. అయినా అతనిపై ఈ వార్తలు ఆగలేదు. పారితోషికం విషయంలో రవితేజ టార్చర్ పెడతాడంటూ తరచూ న్యూస్‌లు వస్తూనే ఉన్నాయి. అంతెందుకు.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా విషయంలోనూ రవితేజ అదే మొండి వైఖరి చూపించాడని ఓ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. కొన్ని సీన్లను రీషూట్ చేయడంతో, వాటికి అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని టాక్స్ నడిచాయి. ఎట్టకేలకు ఈ వార్తలపై రవితేజ తాజాగా స్పందించాడు.
రామారావు ఆన్ డ్యూటీ ప్రచార కార్యక్రమాల్లో ఉన్న ఈ మాస్ మహారాజా.. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పాడు. తాను ఈ సినిమాకి కో-ప్రొడ్యూసర్‌ని అని, అలాంటప్పుడు రెమ్యునరేషన్ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందని తిరిగి ప్రశ్నించాడు. వెబ్ మీడియాలో వస్తోన్న ఇలాంటి అబద్ధప్పు ప్రచారాల్ని నమ్మొద్దని తన ఫ్యాన్స్‌ని విజ్ఞప్తి చేశాడు. కాగా.. ఈ సినిమా ఈ నెల 29వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ట్రైలర్ కట్ బాగుండటంతో, ఈ సినిమాకి మంచి బజ్ వచ్చిపడింది. మరి, క్రాక్ తర్వాత మళ్లీ గాడి తప్పిన రవితేజ, ఈ చిత్రంతో తిరిగి ట్రాక్‌లోకి వస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!