India objected to China's Yuan Wang 5 ship: భారత్ ఒత్తడికి శ్రీలంక తలొగ్గింది. శ్రీలంక హంబన్ టోటా నౌకాశ్రయానికి అత్యాధునికి చైనా నౌక ‘యువాన్ వాంగ్ 5’ రావడాన్ని భారత్ తీవ్రంగా నిరసిస్తోంది. ముఖ్యంగా శాటిలైట్ ట్రాకింగ్ పరిశోధన నౌక యువాన్ వాంగ్ 5 ఆగస్టు 11 నుంచి 17 వరకు హంబన్ టోట పోర్టులో ఉండాల్సి ఉంది. అయితే ఈ నిఘా నౌక భారత్ పై కూడా నిఘా పెడుతుందని మన దేశం…
దాదాపుగా వారం పాటు ఆందోళకారులు అధ్యక్ష భవనంలోనే ఉంటూ.. అక్కడే మద్యం తాగడం, వంట చేసుకుని తినడం, స్మిమ్మింగ్ చేయడం వంటివి చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష భవనం, ప్రధానమంత్రి ఇంటిలో ఉన్న దాదాపు 1000కి పైగా పురాతన కళాఖండాలు మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై అక్కడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీటి విలువ కూడా ఎక్కువగానే ఉంటుందని శ్రీలంక పోలీసులు…
ద్వీప దేశం శ్రీలంకలో మళ్లీ అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయన 134 ఓట్లు సాధించి ప్రత్యర్థి డల్లాస్ అలహప్పెరుమాపై గెలుపొందారు.
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. 8వ అధ్యక్షుడిగా విక్రమసింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. మొత్తం 219 ఓట్లకు గాను 134 ఓట్లను సాధించి ఆయన విజయం సాధించారు. బుధవారం జరిగిన పార్లమెంటరీ ఓటింగ్‌లో 134 ఓట్లతో ప్రత్యర్థి డల్లాస్ అలహప్పెరుమాపై గెలుపొందారు.
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రణిల్ విక్రమసింఘే వెల్లడించారు.
ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇంధనం, గ్యాస్, అవసరమైన ఆహార పదార్థాలను అందించడానికి అత్యవసర సహాయ కార్యక్రమాన్ని అమలు చేయాలని రణిల్ విక్రమసింఘే నిర్ణయించారు. జులై 16న మంత్రులు, పార్లమెంటు సభ్యులతో జరిపిన చర్చల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో శ్రీలంక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన నాయకుడే పరారయ్యాడు. ప్రజలు నిరసనల మధ్య శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులు..అక్కడ నుంచి సింగపూర్ కు వెళ్లాడు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. రాజపక్స రాజీనామా చేయడంతో శ్రీలంకలో ప్రజలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను తగ్గించారు. ప్రభుత్వ భవనాలను కూడా ఆందోళనకారులు ఖాళీ చేశారు. ఈ రోజు శ్రీలంక పార్లమెంట్ సమావేశం కాబోతోంది. కొత్త అధ్యక్షుడి…
Sri Lankan Prime Minister Ranil Wickremesinghe Friday has sworn in as the interim President after Parliament Speaker Mahinda Yapa Abeywardena accepted the resignation of Gotabaya Rajapaksa.
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవుల రాజధాని మాలే నుంచి సింగపూర్ పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక నుంచి మాల్దీవులకు పారిపోయారు గొలబాయ రాజపక్స. ఆయన భార్య ఇద్దరు బాడీగార్డులతో ఆయన మాలే చేరుకున్నారు. ఇదిలా ఉంటే అధ్యక్షుడు పారిపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు ఆందోళనలను ఇంకా పెంచారు. ఏకంగా ప్రధాని, తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే…