Srilanka Crisis: గొటబాయ రాజపక్స రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ యాపా అబేవర్దన ఆమోదించడంతో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక నిరసనకారుల ఆగ్రహావేశాలు చల్లారే దిశగా ప్రజలకు సాయం అందించడంపై రణిల్ దృష్టి సారించారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇంధనం, గ్యాస్, అవసరమైన ఆహార పదార్థాలను అందించడానికి అత్యవసర సహాయ కార్యక్రమాన్ని అమలు చేయాలని రణిల్ విక్రమసింఘే నిర్ణయించారు. జులై 16న మంత్రులు, పార్లమెంటు సభ్యులతో జరిపిన చర్చల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆగస్టులో సమర్పించే రిలీఫ్ బడ్జెట్‌లో అదనంగా వచ్చే డబ్బును కూడా ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు.
ఆహార భద్రత కార్యక్రమం అమలును వేగవంతం చేయాలని తాత్కాలిక అధ్యక్షుడు సూచించారు. ఇంధనం, ఎరువులు సక్రమంగా అందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. చర్చలో వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన వాతావరణాన్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. శాంతియుత నిరసనకారులు అందజేసిన ప్రణాళిక మంచి ప్రణాళికగా గుర్తింపు పొందిందని చర్చ సందర్భంగా విక్రమసింఘే అన్నారు. అవినీతిపై పోరాటానికి తీసుకుంటున్న చర్యలను కార్యకర్తలకు తెలియజేస్తామని తాత్కాలిక అధ్యక్షుడు తెలిపారు.అంతకుముందు, శుక్రవారం, శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
Guinea pig Record: గినియా పంది గిన్నీస్ రికార్డ్.. ఒక్క నిమిషంలో 16 విన్యాసాలు
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేసినందున, రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు వచ్చే వారం సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు చర్యలు తీసుకుంటుందని తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి చూస్తే ద్వీపదేశం ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇదిలావుండగా.. శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సలను కోర్టు అనుమతి లేకుండా జూలై 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని శ్రీలంక సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గొటబాయ రాజపక్సే రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ అబేవర్దన ఆమోదించడంతో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే శుక్రవారం తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. సింగపూర్‌కు చేరుకున్న తర్వాత గొటబాయ రాజపక్స అధికారికంగా అధ్యక్ష పదవిని ఖాళీ చేస్తూ గురువారం తన రాజీనామా లేఖను సమర్పించారు.