బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో దర్శకుడు అయాన్ ముఖర్జీకి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. అయాన్ తొలి చిత్రం ‘వేకప్ సిద్’ 2009లో వచ్చింది. అందులో హీరో రణబీర్ కపూర్. ఆ తర్వాత నాలుగేళ్ళకు అంటే 2013లో అయాన్ రెండో సినిమా ‘యే జవానీ హై దివానీ’ వచ్చింది. అందులోనూ రణబీరే హీరో. ఇప్పుడు ఏకంగా తొమ్మిదేళ్ళ తర్వాత అయాన్ ముఖర్జీ మూడో సినిమా ‘బ్రహ్మస్త’ రాబోతోంది. ఇందులోనూ రణబీర్ కపూరే హీరో.…
‘పెళ్ళయింది… ప్రేమవిందుకు వేళయింది…’అంటూ కొత్త జంట రణబీర్ కపూర్- అలియా భట్ పాడుకుంటున్నారు. వారి ప్రేమవిందుకోసం రణబీర్ తండ్రి రిషికపూర్ గతంలో నిర్మించిన బంగ్లాను ముస్తాబు చేస్తున్నారు. ఈ బంగ్లాను రిషికపూర్ తన తండ్రి రాజ్ కపూర్, తల్లి కృష్ణ కపూర్ పేర్ల మీద ‘కృష్ణ-రాజ్’పేరుతో నిర్మించారు. రణబీర్, అలియా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న సమయం నుంచీ ‘కృష్ణ-రాజ్’ బంగళాను అధునాతనంగా మార్చడానికి రణబీర్ తల్లి నీతూ కపూర్ ఆదేశించారు. దాదాపు సంవత్సరం నుంచీ ఆ బంగ్లాను కోరిన…
తనకు నచ్చిన నటులతో మళ్లీ మళ్లీ పని చేస్తుంటాడు సంజయ్ లీలా బన్సాలీ. హీరోలైనా, హీరోయిన్స్ అయినా ఆయన సినిమాల్లో పదే పదే రిపీట్ అవుతుంటారు. తాజాగా రణవీర్ సింగ్ ఆయన ఫేవరెట్ అయిపోయాడు. ‘రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్’ తరువాత నాలుగోసారి ఈ డైరెక్టర్, హీరో కాంబో వర్కవుట్ కాబోతోంది. అలనాటి క్లాసిక్ మూవీ ‘బైజు బావ్రా’ రీమేక్ కి బన్సాలీ రెడీ అవుతున్న తరుణంలో ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి వచ్చింది… ‘బైజు…
జోయా అఖ్తర్ దర్శకత్వంలో వచ్చిన ‘గల్లీ బాయ్’ మొదట రణబీర్ వద్దకు వెళ్లింది. కానీ, కపూర్ వద్దనటంతో మన సింగ్ గారి వద్దకు వెళ్లింది. రణబీర్ వద్దన్న పాత్రని రణవీర్ సింగ్ ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే, ‘గల్లీ బాయ్’ సూపర్ హిట్! జోయా అఖ్తర్ సినిమా రణబీర్ వద్దనటం ‘గల్లీ బాయ్’ విషయంలోనే కాదు… మరోసారి కూడా జరిగింది. ‘దిల్ దఢక్ నే దో’ సినిమాలో అనీల్ కపూర్ తనయుడిగా రణబీర్ నటించాల్సింది.…