తనకు నచ్చిన నటులతో మళ్లీ మళ్లీ పని చేస్తుంటాడు సంజయ్ లీలా బన్సాలీ. హీరోలైనా, హీరోయిన్స్ అయినా ఆయన సినిమాల్లో పదే పదే రిపీట్ అవుతుంటారు. తాజాగా రణవీర్ సింగ్ ఆయన ఫేవరెట్ అయిపోయాడు. ‘రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్’ తరువాత నాలుగోసారి ఈ డైరెక్టర్, హీరో కాంబో వర్కవుట్ కాబోతోంది. అలనాటి క్లాసిక్ మూవీ ‘బైజు బావ్రా’ రీమేక్ కి బన్సాలీ రెడీ అవుతున్న తరుణంలో ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి వచ్చింది…
‘బైజు బావ్రా’ లాంటి రొమాంటిక్ సాగాకి రణబీర్ అయితే బావుంటుందని సంజయ్ భావించాడట. కానీ, రణబీర్ ఎందుకో ‘నై’ అనేశాడు. కపూర్ కాదనటంతో బన్సాలీ ప్రాజెక్ట్ మన సింగ్ వద్దకొచ్చింది. ఇప్పుడు రణబీర్ స్టానంలో రణవీర్ కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
సంజయ్ లీలా బన్సాలీ ‘బైజు బావ్రా’పై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు. కానీ, రణవీర్ హీరోగా సినిమా త్వరలోనే ప్రకటిస్తారని అంటున్నారు. చూడాలి మరి, ప్రస్తుతం ఆలియా భట్ స్టారర్ ‘గంగూభాయ్ కతియావాడి’ రిలీజ్ కోసం వేచి ఉన్న సంజయ్ ఎప్పటికీ పెదవి విప్పుతాడో! రణవీర్ తో తన నాలుగో సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో!