Ranbir’s movie promotion :
కొత్తగా పెళ్ళయిన జంటకు పట్టపగలే పండగ అంటారు. చుట్టూ ఎవరున్నా సరే, కొత్త జంటకు ఒకరిపై ఒకరికి ధ్యాస, ఆశ తప్పవు. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ ప్రేమించి పెళ్ళి చేసుకొని ప్రేమపక్షుల్లా విహరిస్తున్నారు. ఒకరిపై ఒకరికి ధ్యాస మరింతగా పెరిగింది. పెళ్ళయిన తరువాత రణబీర్ కపూర్ నటించగా విడుదలైన తొలి చిత్రం ‘షంషేరా’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ఈ సినిమాను రణబీర్ భార్యామణి ఎక్కడో వీక్షిస్తున్నట్టున్నారు. ఆ పిక్ ను ఎవరో తీసినట్టుంది. అందులో ఆమె ధరించిన టీ షర్ట్ పై హిందీలో ‘కపూర్’ అని కూడా ఉంది. ఆ పిక్ ను అలియాకు ఎవరు ఫార్వర్డ్ చేశారో కానీ, అందులో ఆమె నిద్రపోతున్నట్టుగా ఉంది. బహుశా, భర్త నటించిన ‘షంషేరా’ చూస్తూ అలా అయిపోయిందా? లేక కింద సెల్ చూస్తూ అలా ఉందా? ఏమో కానీ, ఆ పిక్ నే తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ దానికి ‘ఇట్స్ కపూర్ డే, ‘షంషేరా’ ఇన్ థియేటర్స్ నౌ, గో వాచ్’ అంటూ ట్యాగ్ చేసింది. దాంతో ఇప్పుడు అలియా పిక్ భలేగా సందడి చేస్తోంది.
ఇక అసలు విషయానికి వస్తే, రణబీర్ కపూర్ పెళ్ళయిన తరువాత విడుదలయిన తొలి చిత్రం ‘షంషేరా’ డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతే తప్ప, ఇరగదీసింది లేదు. దాంతో అలియా ట్యాగ్ పై కూడా పలు కామెంట్స్ వెల్లువవుతున్నాయి. కొందరయితే ఈ సినిమా గురించి “film is only sham, no shera” అనీ కామెంట్ చేస్తున్నారు. మరి ‘ఇట్స్ కపూర్ డే” అంటూ ట్వీట్ చేసిన రణబీర్ భార్యామణి ఏమంటారో!?