Rana Daggubati Confirmed In Maanadu Remake: తమిళంలో మంచి విజయం సాధించిన ‘మానాడు’ని తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో కసరత్తులు జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాకి హిట్ స్టేటస్ రాగానే నిర్మాత సురేశ్ బాబు రీమేక్ హక్కులు తీసుకోగా.. తొలుత ఇందులో మాస్ మమారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించనున్నట్టు వార్తలొచ్చాయి. అనంతరం మరో ఇద్దరు, ముగ్గురు హీరోల పేర్లు చక్కర్లు కొట్టాయి. చివరికి నాగ చైతన్య కన్ఫమ్ అయినట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు.. ప్రీ-ప్రొడక్షన్…
ఫిదా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమై అందరి హృదయాలను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ఇటీవలే విరాటపర్వం చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె ప్రస్తుతం గార్గి సినిమాలో నటిస్తోంది.
అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. లవ్, ఎఫైర్స్ వంటి జోలికి వెళ్లకుండా కేవలం వృత్తి మీదే పూర్తి దృష్టి పెట్టిన సాయి పల్లవికి కూడా ఓ ప్రేమకథ ఉంది. ఈ విషయం స్వయంగా ఆ అమ్మడే రివీల్ చేసింది. కాకపోతే.. ఆ లవ్ స్టోరీ ఇప్పటిదో లేక కాలేజీ రోజుల్లోనో నడవలేదులెండి, ఏడో తరగతిలో నడిచిన వ్యవహారమిది. ‘‘నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాశాను. నా జీవితంలో నేను రాసిన…
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. మహిళా నక్సలైట్ సరళ జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో నందితా దాస్, ప్రియమణి, జరీనా వాహెబ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. విమర్శకుల ప్రశంసలను ఈ సినిమా అందుకున్నా, కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. దాంతో జూలై…
వాయిదాల మీద వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు విరాటపర్వం ఈ శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకొచ్చింది. రానా దగ్గుబాటు, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని అన్నారు. ‘‘ఇది (విరాటపర్వం) నా బ్యానర్లో వచ్చిన మొదటి బయోపిక్. ఈ…