Southern Spices Group Of Chairman Nanda Kumar Comments On Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీ ఓ భూవివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే! ఆల్రెడీ ఈ కేసులో కోర్టుకు హాజరయ్యారు కూడా! ఈరోజు కూడా కోర్టుకి హాజరు కావాల్సి ఉండగా, అతని రాలేదు. దీంతో ఈ కేసుని విచారిస్తున్న సిటీ సివిల్ కోర్టుని, ఆగస్టు 2వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్ వేసిన సదరన్ స్పైసిస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ నందకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు అమ్మిన భూమిని సురేశ్ బాబు తన కొడుకు రానాకు రిజిస్ట్రేషన్ చేశాడని ఆరోపించాడు. తనతోపాటు మరొకరిని కూడా అగ్రిమెంట్ పేరుతో దగ్గుబాటి ఫ్యామిలీ మోసం చేశాడని ఆరోపణలు చేశాడు. కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఆ రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు వాపోయాడు.
హీరో వెంకటేష్‌తో సైతం 1200 గజాల భూమి విషయంలో లీజ్ అగ్రిమెంట్ ఉందని తెలిపిన నందకుమార్.. ఇప్పుడు తనని బలవంతంగా ఖాళీ చేయించేందుకు దగ్గుబాటి ఫ్యామిలీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నాడు. తమకున్న పరపతిని ఉపయోగించి తనని పలు రకాలుగా వేధిస్తున్నారని.. గతంలోనే ఉన్నతాధికారులు, రాజకీయ నేతలతో తనని బెదిరించారని చెప్పాడు. ఎప్పుడు, ఏం జరుగుతుందో తెలియక తన కుటుంబం భయాందోళనలకు గురవుతోందని, తనకేం జరిగినా సురేష్ బాబుదే బాధ్యత అంటూ అతను కుండబద్దలు కొట్టాడు. తనకు న్యాయం జరిగేంతవరకూ పోరాడుతూనే ఉంటానని వెల్లడించాడు. ఎప్పుడు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని దగ్గుబాటి ఫ్యామిలీ.. తొలిసారి భూవివాదంలో చిక్కుకోవడం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. దీనిపై ఫ్యామిలీ నుంచి ఇంతవరకూ ఎవ్వరూ స్పందించలేదు.