కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకొనే కథానాయకుడు రానా దగ్గుబాటి. ఇప్పటికే ‘బాహుబలి, ఘాజీ, అరణ్య’ వంటి పాన్ ఇండియా మూవీస్ చేసిన రానా మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపీనాథ్ ఈ సినిమాను సిహెచ్ రాంబాబుతో కలిసి నిర్మించబోతున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్, రానా మూవీ షూటింగ్ పూర్తి కాగానే, రానాతో ఈ సినిమాను ప్రారంభిస్తామని నిర్మాతలు…
కరోనాను ఎదుర్కొవడంలో కేవలం వైద్య సిబ్బందే కాదు… ఇతరులూ తమ వంతు సాయం చేస్తున్నారు. సోనూ సూద్ మొదలు కొని ఎంతో మంది సెలబ్రిటీస్ తమ పరిథిలో ఆపన్న హస్తం అందించే పనిలో ఉన్నారు. సురేశ్ ప్రొడక్షన్ వంటి నిర్మాణ సంస్థలు ఎప్పటికప్పుడు కరోనా బాధితుల అవసరాలు తెలుసుకుని, సోషల్ మీడియా ద్వారా వారికి సహాయం చేసే వారికి ఆ విషయాన్ని చేరవేసే పని చేస్తున్నాయి. ఇదే సమయంలో నటుడు రానా మరో అడుగు ముందుకేసి కరోనా…