Nani – Karthi : నేచురల్ స్టార్ నాని తమిళ మెట్లు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్నాడు. హిట్-3తో రూ.100 కోట్ల క్లబ్ లో చేరాడు. అలాగే నిర్మాతగానూ వరుస హిట్లు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ గ్యాప్ లో ఆయన తమిళ స్టార్ హీరో కార్తీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కార్తీ ఇప్పటికే సర్దార్-2 సినిమాను కంప్లీట్ చేశాడు.…
PM Modi: హిందీ, తమిళ భాషా వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, సీఎం స్టాలిన్‌ని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు నుంచి తనకు అనేక మంది నాయకుల లేఖలు వచ్చాయని, వారిలో ఎవరూ కూడా తమిళంలో సంతకం చేయలేదని ప్రధాని మోడీ అన్నారు. వారు తమ భాష పట్ల నిజంగా గర్వపడితే, కనీసం తమిళంలో అయినా తమ పేర్లను సంతకంగా చేయాలని కోరారు.
శ్రీరామ నవమి 2025 సందర్భంగా భారతదేశంలోని మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్‌ను (పంబన్ బ్రిడ్జ్) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రిమోట్ పద్ధతిలో పంబన్ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన ప్రధాని.. వంతెనను జాతికి అంకితమిచ్చారు. అదే సమయంలో రామేశ్వరం-తాంబరం (చెన్నై) కొత్త రైలు సేవను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి రైలు బయలుదేరింది. Also Read: Ayodhya Ram Mandir: అయోధ్యలో అద్భుత దృశ్యం.. బాలరాముడికి ‘సూర్యతిలకం’! తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో…
Pamban Bridge: తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామ నవమి సందర్భంగా పంబన్ బ్రిడ్జిను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
Fishermen Released: శ్రీలంక జైలు నుంచి విడుదలైన 15 మంది భారతీయ మత్స్యకారులు గురువారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దులు దాటుకొని వెళ్లి చేపలు పట్టినందుకు మత్స్యకారులను అరెస్టు చేశారు. తమిళనాడు మత్స్యశాఖ అధికారులు విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికి స్వగ్రామాలకు పంపించారు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఎనిమిది మంది మత్స్యకారుల బృందం 2024 సెప్టెంబర్ 27న మన్నార్ ద్వీపం ప్రాంతానికి సమీపంలో చేపలు వేడుతుండగా, శ్రీలంక నావికాదళం సరిహద్దు దాటి చేపలు…
Pamban bridge: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం తమిళనాడు రామేశ్వరంలో నిర్మితమైన కొత్త వంతెన ఫోటోలను పంచుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటి ‘‘వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్’’గా కొత్తగా పంబన్ వంతెన కీర్తి గడించింది. ఈ వంతెన ద్వారా 105 ఏళ్ల పాత వంతెనని భర్తీ చేయనున్నారు. ఎక్స్ వేదికగా ఈ ఇంజనీరింగ్ అద్భుతం గురించి కేంద్రమంత్రి వెల్లడించారు. కొత్త పంబన్ వంతెనని ‘‘ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం’’గా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు వేగం, భద్రత కోసం డిజైన్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించారు. అందులో భాగంగా రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ప్రధాని ఇక్కడి అగ్ని తీర్థంలో సముద్ర స్నానమాచరించారు. అంతేకాక ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలనూ ఒంటిపై పోసుకున్నారు. అనంతరం 'శ్రీరామాయణ పారాయణ' కార్యక్రమంలో పాల్గొన్నారు.
దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితంపై రాసిన 'మెమోరీస్ నెవర్ డై' పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రామేశ్వరంలో ఆవిష్కరించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన అమిత్ షా రామనాథస్వామి ఆలయాన్ని కూడా సందర్శించారు.