Pamban bridge: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం తమిళనాడు రామేశ్వరంలో నిర్మితమైన కొత్త వంతెన ఫోటోలను పంచుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటి ‘‘వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్’’గా కొత్తగా పంబన్ వంతెన కీర్తి గడించింది. ఈ వంతెన ద్వారా 105 ఏళ్ల పాత వంతెనని భర్తీ చేయనున్నారు. ఎక్స్ వేదికగా ఈ ఇంజనీరింగ్ అద్భుతం గురించి కేంద్రమంత్రి వెల్లడించారు. కొత్త పంబన్ వంతెనని ‘‘ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం’’గా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు వేగం, భద్రత కోసం డిజైన్ చేసినట్లు వెల్లడించారు.
Read Also: BiggBoss : బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. టికెట్ టు ఫినాలే ఎవరికి ఇచ్చిందో తెలుసా ?
1914 నుంచి సేవలు అందిస్తున్న పాత పంబన్ రైలు వంతెన గురించి ఆయన ప్రస్తావించారు. తప్పు కారణంగా 2022 డిసెంబర్‌లో ఈ వంతెనని నిలిపేశారు. 1914లో నిర్మితమైన పాత పంబన్ వంతెన ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో అనుసంధానించింది. పాత వంతెన 19 మీటర్ల ఎయిర్ క్లియరెన్స్‌తో మాన్యువల్ షెర్జర్ లిఫ్ట్ స్పాన్, సింగిల్ ట్రాక్, తక్కువ వేగంతో నడిచే రైళ్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే, కొత్తగా నిర్మించిన వంతెన పూర్తిగా ఆటోమేటెడ్ వర్టికల్ లిఫ్ట్ స్పాన్ సురక్షితమైన 22-మీటర్ల క్లియరెన్స్‌ను కలిగి ఉంది. డబుల్ ట్రాక్స్, విద్యుద్దకరణకు అనువుగా ఉంది. హైస్పీడ్ రైళ్ల కోసం రూపొందించబడింది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) ద్వారా రూ. 535 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ 2-కిమీ పొడవైన వంతెన ఇంజనీరింగ్ అద్భుతం. వంతెన 100 స్పాన్‌లను కలిగి ఉంది. వాటిలో 99, 18.3 మీటర్లు ఉండగా, సముద్ర ట్రాఫిక్ కోసం 73 మీటర్ల నావిగేషన్ స్పాన్‌లను కలిగి ఉంది.
5/ Current status
✅ Construction: Complete.
✅ Lift span: Tested multiple times.
🚦 Next: Safety inspections by the Commission of Railway Safety (CRS). pic.twitter.com/PKRhFFthaz— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 29, 2024
1/ 🚆India’s first vertical lift railway sea bridge!
The New Pamban Bridge connects the Indian mainland to Rameswaram Island, Tamil Nadu. This state-of-the-art project is a significant upgrade, designed for speed, safety and innovation. pic.twitter.com/HVBafCM1Ne— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 29, 2024