Pamban Bridge: తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామ నవమి సందర్భంగా పంబన్ బ్రిడ్జిను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇక, ప్రధాని పర్యటన నేపథ్యంలో శర వేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 6వ తేదీన ప్రధాని రామేశ్వరంలో పర్యటించబోతున్నారు. రామేశ్వరం- తాంబరం మధ్య బ్రిటీష్ కాలంలో నిర్మించిన పంబన్ బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెనను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది.
Read Also: CM Chandrababu: ఉగాది రోజున సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
అయితే, ఈ పంబన్ బ్రిడ్జిని సుమారు 535 కోట్ల రూపాయల వ్యయంతో 2.5 కిలో మీటర్ల కంటే ఎక్కువ పొడవుతో నిర్మాణం చేపట్టారు. రైల్వే బ్రిడ్జి మధ్య భాగంలో వర్టికల్ లిఫ్ట్ ను సైతం ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఓడలు, పడవలు రాకపోకలు కొనసాగే వీలుంటుంది. ఆ సమయంలో ఈ బ్రిడ్జి నిటారుగా పైకి లిఫ్ట్ అయ్యెలా నిర్మాణం చేపట్టారు. వర్టికల్ లిఫ్ట్ మెకానిజం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ రైల్వే బ్రిడ్జి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.