శ్రీరామ నవమి 2025 సందర్భంగా భారతదేశంలోని మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్‌ను (పంబన్ బ్రిడ్జ్) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రిమోట్ పద్ధతిలో పంబన్ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన ప్రధాని.. వంతెనను జాతికి అంకితమిచ్చారు. అదే సమయంలో రామేశ్వరం-తాంబరం (చెన్నై) కొత్త రైలు సేవను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి రైలు బయలుదేరింది.
Also Read: Ayodhya Ram Mandir: అయోధ్యలో అద్భుత దృశ్యం.. బాలరాముడికి ‘సూర్యతిలకం’!
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో పంబన్ బ్రిడ్జ్‌ను నిర్మించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును నాలుగు ఏళ్లలో పూర్తి చేసింది. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవున బ్రిడ్జ్‌ను తీర్చిదిద్దారు. బ్రిడ్జ్ దిగువన ఓడల రాకపోకలకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ రామేశ్వరం ద్వీపాన్ని భారత ఖండంతో అనుసంధానం చేస్తుంది. పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం భారతదేశ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 2019 మార్చి 1న ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. 2024 నవంబర్ నాటికి పూర్తయింది. 1914లో బ్రిటిష్ ఇంజనీర్లు నిర్మించిన పాత పాంబన్ బ్రిడ్జ్ 105 సంవత్సరాల పాటు సేవలందించింది. అయితే సముద్ర వాతావరణం వల్ల క్షీణించడం, తుప్పు పట్టడం వల్ల డిసెంబర్ 2022లో ఈ వంతెన ఉపయోగం ఆగిపోయింది.
Rameswaram, Tamil Nadu: PM Narendra Modi inaugurates New Pamban Bridge – India’s first vertical lift sea bridge and flags off Rameswaram-Tambaram (Chennai) new train service, on the occasion of #RamNavami2025 pic.twitter.com/6ts8HNdwqy
— ANI (@ANI) April 6, 2025