కమలం పార్టీ నేత రమేష్ బిదూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అతిషి మార్లెనాని టార్గెట్ చేశారు. ఆమె తల్లిదండ్రులు పార్లమెంట్‌పై దాడి చేసిన టెర్రరిస్టు అఫ్జల్ గురుకు మద్దతు ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు.
Ramesh Bidhuri: బీజేపీ నేత రమేష్ బిధురి మరోసారి ఢిల్లీ సీఎం అతిషీని టార్గెట్ చేశారు. ఇప్పటికే అతిషీ తన తండ్రి పేరును మార్చిందని వ్యాఖ్యలు చేసిన బిధురి ఈసారి.. ఆమె ‘‘జింక’’లా తిరుగుతోందని కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరు నేతలు రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యల కొత్త వివాదానికి దారి తీశాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని్కల్లో అధికార పార్టీ ఆప్-బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీల మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ఇక బీజేపీ అయితే కేజ్రీవాల్ టార్గెట్‌గా దాడి చేస్తోంది.
BJP: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరిపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు టాక్. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీపైనే కాకుండా.. ప్రియాంకపైనా అతడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారానికి దారి తీసింది.
Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. రమేష్ బిదురి వ్యాఖ్యలకు నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలని యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసి, రమేష్ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు. Formula E Car Race…
Ramesh Bidhuri: బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే, నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకా గాంధీ చెంపల వలే స్మూత్‌గా చేస్తానని ఆదివారం కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలుపై వివాదం చెలరేగింది.
Ramesh Bidhuri: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీల మధ్య మాటలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Ravi Kishan: బీజేపీ ఎంపీ నటుడు రవికిషన్ అన్‌పార్లమెంటరీ చట్టాన్ని పరిశీలించాలని డానిష్ అలీపై చర్య తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ కి లేఖ రాశారు. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే వివాదం కొనసాగుతోంది. మతప్రాతిపదికన బిధూరి, డానిష్ అలీపై వ్యాఖ్యానించాడు. ఈ వివాదం బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది. చంద్రయాన్ -3 చర్చ సందర్భంగా రమేష్ బిధూరి అతనిపై పార్లమెంట్ లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు…
బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఎదురుదాడి చేశారు. హిమంత బిస్వా శర్మ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రేమ మాత్రమే ఉంది, ద్వేషం లేదు, ప్రేమ దుకాణం వంటి పదాలు తమ నిఘంటువులో లేవన్నారు. ఈ ప్రేమ దుకాణం ఓట్ల కోసం మాత్రమేనని విమర్శించారు.
Danish Ali: పార్లమెంట్ లో గురువారం చంద్రయాన్-3 చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి, బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రమేష్ బిధూరిని అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా కూడా సీరియన్ అయ్యారు. మరోసారి ఇవి రిపీట్ అయితే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై రమేష్ బిధూరికి బీజేపీ పార్టీ…