Himanta Biswa Sharma: నా ముందు నిలబడే ధైర్యం రాహుల్ గాంధీకి లేదు.. అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఎదురుదాడి చేశారు. హిమంత బిస్వా శర్మ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రేమ మాత్రమే ఉంది, ద్వేషం లేదు, ప్రేమ దుకాణం వంటి పదాలు తమ నిఘంటువులో లేవన్నారు. ఈ ప్రేమ దుకాణం ఓట్ల కోసం మాత్రమేనని విమర్శించారు. ఎవరికైనా దుకాణం ఉంటే అది లాభం కోసం.. మీరు ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు దుకాణం ఎక్కడ నుండి వచ్చిందని ప్రశ్నించారు.
Read Also: Uttar Pradesh: 15 ఏళ్ల బాలిక కిడ్నాప్.. 3 నెలల పాటు అత్యాచారం
Also Read
ఇంతకుముందు రాహుల్ గాంధీ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని కలిశారు. ఆ తరువాత వారు కౌగలించుకున్న ‘X’ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. క్యాప్షన్ లో “ద్వేషం యొక్క మార్కెట్‌లో ప్రేమ దుకాణం” అని రాశాడు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా అస్సాం సీఎం రీ కౌంటర్ ఇచ్చారు. మీరు కేవలం ప్రేమ గురించి మాట్లాడితే అది అర్ధం అవుతుంది.. కానీ దానిలో దుకాణం వస్తోంది అంటే అది లాభదాయకం, ఈ లాభం ఓట్ల కోసం తప్ప మరొకటి కాదని విమర్శించారు. ఈ సందర్భంగా.. ఢిల్లీలో జరిగిన కాన్‌క్లేవ్ 2023లో హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి తన ముందు నిలబడే ధైర్యం లేదన్నారు. అతను ఎప్పుడూ భారతదేశ ప్రజలను తక్కువగా అంచనా వేస్తాడని.. భారతీయులు రాజకీయంగా పరిణతి చెందినవారు, మరింత సున్నితంగా ఉంటారని తెలిపారు.
రమేష్ బిధూరిపై హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ఈ విషయం గురించి తనకు పూర్తి సమాచారం లేదని.. పార్టీ నోటీసు జారీ చేసింది, చర్య తీసుకుంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రధాని గురించి మాట్లాడారు.
తాజావార్తలు
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!