Ravi Kishan: డానిష్ అలీపై చర్య తీసుకోవాలి..స్పీకర్ని కోరిన రేసుగుర్రం విలన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Kishan: బీజేపీ ఎంపీ నటుడు రవికిషన్ అన్‌పార్లమెంటరీ చట్టాన్ని పరిశీలించాలని డానిష్ అలీపై చర్య తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ కి లేఖ రాశారు. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే వివాదం కొనసాగుతోంది. మతప్రాతిపదికన బిధూరి, డానిష్ అలీపై వ్యాఖ్యానించాడు. ఈ వివాదం బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది. చంద్రయాన్ -3 చర్చ సందర్భంగా రమేష్ బిధూరి అతనిపై పార్లమెంట్ లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీలు కూడా తగ్గడం లేదు. ఇప్పటికే బిధూరితో పాటు మరో ఎంపీ నిషికాంత్ దూబే, డానిష్ అలీ వ్యవహారాన్ని తప్పుపట్టాడు. గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ కూడా ఈ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ డిసెంబర్ 9, 2022న నేను జనాభా నియంత్రణపై ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీ అన్‌పార్లమెంటరీ చర్యలు, పదాలు వినియోగించడాన్ని పరిశీలించాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను’’ అంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రవికిషన్ లేఖ రాశారు.
Also Read
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
Read Also: Himanta Biswa Sharma: నా ముందు నిలబడే ధైర్యం రాహుల్ గాంధీకి లేదు.. అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్లో రమేష్ బిధూరి మాట్లాడుతున్న సమయంలో బీఎస్పీ ఎంపీ నిరంతరం రన్నింగ్ కామెంట్రీ చేయడంతో పాటు అభ్యంతరకర పదాలను ఉపయోగించాడని రవి కిషన్ తన లేఖలో పేర్కొన్నాడు. అయితే రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు సరికాదని, దేవాలయం లాంటి పార్లమెంట్ లో అలా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని అయితే డానిష్ అలీ చేసిన ఇలాంటి వ్యాఖ్యలే బిధూరి అలా మాట్లాడటానికి కారణమయ్యాయని, వీటిని మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.
అంతకుముందు బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా కూడా లోక్ సభలో ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేఖంగా మతమపరమైన దూషణలు, వివాదాస్పద వ్యాఖ్యలను డానిష్ అలీ చేయడం వల్లే బిధూరి స్పందించాల్సి వచ్చిందని ఆరోపించారు. బీఎస్పీ ఎంపీ ప్రధానిని ‘నీచ్’ అని పిలిచారని, అందుకే బిధూరి ఆగ్రహంతో సమాధానం చెప్పారని మాల్వియా అన్నారు. రమేష్ బిధూరి వ్యాఖ్యలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ క్షమాపణలు చెప్పారు. అయినా ఇది రాజకీయంగా వివాదాస్పదం అయింది. ఇప్పటికే బిధూరిపై చర్యలు తీసుకోవాలని డానిష్ అలీ స్పీకరి కి లేఖ రాశారు. మరోవైపు బీజేపీ కూడా బిధూరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!