Ramesh Bidhuri: బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తన తోటి సభ్యుడు, బీఎస్పీ పార్టీకి చెందిన ముస్లిం ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. లోక్‌సభలో గురువారం చంద్రయాన్-3 మిషన్ పై చర్చ సందర్భంగా బిధూరి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బిధూరి వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునారవృతమైతే చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
MP Ramesh Bidhuri: రాజ్యసభలో గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతుండగా.. లోక్‌సభలో చంద్రయాన్-3 విజయంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ రమేష్ బిధూరి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర ప్రకటన చేశారు.