Heavy Rains in Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి నది నీటిమట్టం 46.6 అడుగులు ఉండగా మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అయితే, గోదావరి కరకట్ట వద్ద ఉన్న స్లూయిజ్ ను మూసి వేయడంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవటంలో విఫలమయ్యారు. గత రాత్రి భద్రాచలంలో భారీ వర్షం కురవడంతో వర్షపు నీరు అంతా కూడా రామాలయం సమీపంలోకి చేరుకుంది. నీళ్లు వెళ్లే దారి లేకపోవడంతో రామాలయం చుట్టూ వరద నీరు పేరుకుని పోయింది.
Read Also: UP: ‘ఐ లవ్ ముహమ్మద్’ నిరసనలపై ఉక్కుపాదం.. యూపీ మతాధికారి అరెస్ట్
అలాగే, రామాలయం సమీపంలోని అన్నదాన సత్రంలోకి గోదావరి వరద నీళ్లు వెళ్లాయి. రామాలయం మెట్ల మార్గం చుట్టూ నీళ్లు భారీగా చేరుకున్నాయి. ఇక, విషయం తెలిసిన అధికారులు ఆలస్యంగా స్పందించారు. నిర్లక్ష్యంగా పని చేస్తూ, మోటార్లను ఆన్ చేసి నీటిని గోదావరిలోకి పంపిణీ చేస్తున్నారు. ఇకపోతే తాలీ పేరు, కిన్నెరసాని గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని రిలీజ్ చేస్తున్నారు. అలాగే, పాలేరు రిజర్వాయర్ అలుగు పారుతుండగా వైరా రిజర్వాయర్ నిండుకుండలా ఉంది.