Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అన్న విషయం అందరికి తెల్సిందే. ఫుల్ బిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా భార్య ఉపాసన కోసం కొన్నిరోజులు గ్యాప్ తీసుకొని అయినా ఆమెతో గడుపుతూ ఉంటాడు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగి దాదాపు పదేళ్ళవుతోంది. ఇంకా ఈ దంపతులు పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఏమిటో అభిమానులకు అర్థం కావడం లేదు. దక్షిణాది సినీ స్టార్స్ ఫ్యాన్స్ తమ హీరోలకు వారసులు ఉండాలని, వారిని కూడా తాము అభిమానించాలని కోరుకుంటూ ఉంటారు. అందువల్ల తమ అభిమాన హీరో రామ్ చరణ్‌కు ఎప్పుడు పిల్లలు పుడతారా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే ఆయన భార్య ఉపాసన ఇప్పటికే ఈ విషయమై పలుసార్లు…
కొరటాల శివ నిన్న మొన్నటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడు. అయితే ఒక్క సినిమాతో ఆయన పరిస్థితి తలక్రిందులు అయింది. రచయితగా ‘భద్ర, మున్నా, నిన్ననేడు రేపు, ఒక్కడున్నాడు, సింహా, బృందావనం, ఊసరవెల్లి’ సినిమాలకు పని చేసి ‘మిర్చి’తో దర్శకుడుగా మారాడు. ఈ సినిమా ఘన విజయం కొరటాలను అందలం ఎక్కించింది. ఆ తర్వాత ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను’ సినిమాలతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఇన్ని సక్సెస్ లు ఉన్న…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూట్లోనే వెళ్లబోతున్నాడా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ట్రిపుల్ ఆర్తో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న చరణ్.. ఇప్పుడు అందుకు తగ్గట్టే భారీగా బాలీవుడ్ రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఇంతకీ చెర్రీ టార్గెట్ ఏంటి.. ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాడు..! బాహుబలితో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న ప్రభాస్.. ఆ తర్వాత కూడా ఆ స్థాయిలోనే సినిమాలు చేస్తున్నాడు. అయితే…
స్టార్ బ్యూటీ సమంత ఓ పాపులర్ షోకు హాజరైందని.. అందులో చైతన్యతో విడాకులపైనోరు విప్పిందని.. కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అదే షోకు వెళ్లేందుకు చరణ్, తారక్ నో చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా షో.. నిజంగానే మన స్టార్ హీరోలు దాన్ని రిజెక్ట్ చేశారా.. సమంత ఎపిసోడ్ ఎప్పుడు రాబోతోంది..! అసలెందుకు సమంత, చైతన్య విడాకులు తీసుకున్నారనేది.. ఇప్పటికీ క్వశ్చన్ మార్క్‌గానే ఉంది. ఇప్పటి వరకు చైతూ గానీ, సమంత గానీ…
డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో మంచి విజయాన్ని సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’. దాని సీజన్ -2 ట్రైలర్ వచ్చేసింది. జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ ను ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ డైరెక్ట్ చేశారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది రూపొందించారు. ఈ సెకండ్ సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి…
మెగాస్టార్ చిరంజీవి వరుసగా లైన్లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘గాడ్ఫాడర్’ ఒకటి. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’కు ఇది రీమేక్. మోహన్ రాజా దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఫస్ట్ లుక్ టీజర్‌ని విడుదల చేసింది. ఇందులో చిరు ఇచ్చే మాస్ ఎంట్రీకి రొమాలు నిక్కబొడుచుకోవాల్సిందే! కార్యకర్తలు పార్టీ జెండాలు ఊపుతుండగా.. వారి మధ్య నుంచి బ్లాక్ కలర్ కారు…
స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR’ మూవీ ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఎంత గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కలెక్షన్లలో రికార్డులు బద్దలుకొట్టిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఒకవైపు బైక్‌పై ఎన్టీఆర్…
సినిమా సినిమాకి మన హీరోలు లుక్ పరంగా వేరియేషన్స్ చూపిస్తుంటారు. ఒకే లుక్‌లో కనిపిస్తే ఫ్యాన్స్ సహా ఆడియన్స్‌కి బోర్ కొట్టడం సహజం. పైగా.. ప్రతీ సినిమా నుంచి కొత్తదనం కోరుకుంటారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకునే మన హీరోలు లుక్స్ మారుస్తుంటారు. మేకర్స్ కూడా వీరితో రకరకాల ప్రయోగాలు చేయిస్తుంటారు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు స్టైలిష్‌గా, రగ్డ్గా చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు రామ్ చరణ్‌ను దర్శకుడు శంకర్ తన సినిమాలో అల్ట్రా స్టైలిష్‌గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది.…