RRR: నిన్న శంకర్.. నేడు కాశీ విశ్వనాథ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR: ‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీని భారత దేశం తరఫున ఆస్కార్ కు అధికారికంగా నామినేట్ చేయకపోవడంపై విమర్శలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. నిన్న దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎన్. శంకర్ తన అసంతృప్తిని వ్యక్తం చేయగా, ఇవాళ దర్శకుల సంఘం ప్రస్తుతం అధ్యక్షుడు వై. కాశీ విశ్వనాథ్ సైతం స్పందించారు. ఆయన తన ప్రకటనలో ”దేశభక్తిని చాటి చెప్పే చిత్రాలు ఎన్నో వచ్చాయి. ఫిక్షన్ యాంగిల్ లో, కల్పిత కధతో ఎంతో కష్టపడి, ఎన్నో సంవత్సరాలు వెచ్చించి అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ‘ఆర్.ఆర్.ఆర్.’. కంటెంట్ పరంగా కానీ సందేశం పరంగా గానీ దేశ ఖ్యాతిని ఇనుమడింప జేసే సినిమా” అని అని అన్నారు.
ఇక ఈ సినిమాలోని సన్నివేశాలను రక్తి కట్టించడంలో కానీ నటీనటుల నుంచి పెరఫార్మెన్స్ రాబట్టుకోవడంలో గానీ దర్శకులు రాజమౌళి ప్రాణం పెట్టి పని చేశారని, హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆ యా పాత్రలలో జీవించారని, అలానే టెక్నీషియన్స్ ప్రతిభ అమోఘమ’ని కాశీ విశ్వనాథ్ తెలిపారు. అలాంటి సినిమాను ఆస్కార్ కి నామినేట్ చేయకుండా, ‘చెల్లో షో’ అనే గుజరాతీ సినిమాను నామినేట్ చేయడం, తెలుగు చిత్రాన్ని పట్టించుకోకపోవడం శోచనీయని అన్నారు. ఈ చర్యను ఖండిస్తూ, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా తన అసంతృప్తిని తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!