Ram Charan: రామ్ చరణ్ ఎవరో నాకు తెలియదు.. విజయ్ ట్రైనర్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: సెలబ్రిటీలు నిత్యం యవ్వనంలా కనిపించాలంటే వర్క్ అవుట్స్, డైట్ చేయాల్సిందే. ఇక తారలు కుటుంబ సభ్యులతో కంటే ఫిట్ నెస్ ట్రైనర్లతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇక టాలీవుడ్ తారల ఫిట్ నెస్ ట్రైనర్ కులదీప్ సేతి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ నుంచి విజయ్ దేవరకొండ వరకు అందరికి కులదీప్ ఒక్కడే ట్రైనర్ గా కొనసాగుతున్నాడు. ఇక తాజాగా లైగర్ లో విజయ్ అద్భుతమైన రూపానికి ఇతగాడే కారణం. రష్మిక, రాశీ ఖన్నా లాంటి హీరోయిన్లు సైతం కులదీప్ క్లయింట్స్సే. ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కులదీప్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. రామ్ చరణ్ ను ట్రైన్ చేసినప్పుడు అతడు ఎవరో తనకు తెలియదని, ఆయన కూడా ఎప్పుడు తాను మెగాస్టార్ కొడుకును అని చెప్పలేదని తెలిపారు.
“రామ్ చరణ్ ను మొదటిసారి జిమ్ లో కలిసినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు. అందరిలానే ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. ఒక రోజు నా ఫ్రెండ్ అతను ఎవరో తెలుసా అంటే.. తెలియదు అని చెప్పాను. వెంటనే నా ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకు అని చెప్పాడు. నేను షాక్ అయ్యాను ఆ తర్వాత చరణ్ దగ్గరకు వెళ్లి.. ఏంటి భయ్యా మీరు మా బాస్ చిరంజీవి గారి కొడుకు అని ఎందుకు చెప్పలేదు అని అడిగితే.. ఏం చెప్పాలి అని చిన్నగా నవ్వేశారు. ఆ తరువాత ఆయనతో పాటు చిరంజీవి గారిని కూడా ట్రైన్ చేసే అవకాశం వచ్చింది. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే లక్షణం చరణ్ లో కనిపిస్తూ ఉంటుంది. ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
- Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్‌పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
- Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
- Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
తాజావార్తలు
-
IND vs NZ ODI: ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. భారత్ తుది జట్టులో ఊహించని మార్పులు.. కొత్త కుర్రాడి ఎంట్రీ..
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని డబ్బు.. మీరేనేమో తెలుసుకోండి!
-
SpaceX: చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్.. అంతరిక్షం నుంచి వచ్చిన స్టార్‌షిప్‌ను గాల్లోనే పట్టుకున్న లాంచ్ టవర్
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!