RC15: చరణ్ కోసం రంగంలోకి మలయాళ స్టార్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Lal To Play Key Role In RC15 Movie: రామ్ చరణ్, శంకర్ కాంబోలో ఒక భారీ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! పొలిటికల్ త్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. కీలక పాత్రల కోసం పరభాష నటుల్ని కూడా తీసుకుంటున్నారు. ఆల్రెడీ జయరాం, ఎస్‌జే సూర్య నటిస్తున్నట్టు స్వయంగా చిత్రబృందమే రివీల్ చేసింది. ఇప్పుడు మరో మలయాళ స్టార్‌ను రంగంలోకి దింపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ మరెవ్వరో కాదు.. మోహన్ లాల్. ఈ సినిమా ద్వితీయార్థంలో ఆయన పాత్ర ఎంట్రీ ఇస్తుందని.. దర్శకుడు శంకర్ చాలా డిఫరెంట్‌గా, పవర్‌ఫుల్‌గా ఈ పాత్రని డిజైన్ చేశాడని అంటున్నారు. తొలుత కొందరిని పరిశీలించాక, ఫైనల్‌గా మోహన్ లాల్‌ని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రకి గాను ఆయనకు భారీ పారితోషికమే ముట్టిందని చెప్తున్నారు. అయితే.. ఈ వార్తలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
కాగా.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలి, తదితర నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి.. ఇటీవల శంకర్ ‘ఇండియన్ 2’ షూటింగ్‌ని తిరిగి ప్రారంభించడంతో, RC15 షూటింగ్ ఆలస్యం అవుతుందేమోనని అనుమానాలు రేకెత్తాయి. అయితే.. అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, తాను ఏకకాలంలో ఈ రెండు సినిమాల షూటింగ్స్ నిర్వహిస్తున్నానని, ముందుగా చెప్పిన సమయానికే RC15 సినిమాను విడుదల చేస్తామని శంకర్ క్లారిటీ ఇచ్చాడు.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!